Waltair Veerayya: మెగా 154 డిస్ట్రిబ్యూషన్ డీల్ అదిరిందిగా!

మెగాస్టార్ చిరంజీవి.. పాలిటిక్స్ లోకి రాకముందు వరకు టాలీవుడ్ లో నెంబర్ వన్ ఎవరు అనడిగితే.. పిల్లాడి నుండి ముసలి వాళ్ల వరకు అందరూ ఆయన పేరే చెప్పేవారు. చిరు రాజకీయాల్లోకి వెళ్లాక సినిమా ఇండస్ట్రీలో లెక్కలు మారిపోయాయి.. స్టార్ డమ్ అంటే అర్థం పర్థం లేకుండా తయారయింది పరిస్థితి. ఇప్పుడు హిట్స్, వందల కోట్ల కలెక్షన్స్ కొడితే ఎవరైనా స్టారే. కానీ ఎవరూ కూడా చిరు చరిష్మాను, స్టార్ డమ్ ను మ్యాచ్ చెయ్యలేరనేది వాస్తవం.

‘ఖైదీ నెం:150’ తొ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన మెగాస్టార్.. ఎప్పటినుండో చెయ్యాలని ఆశపడ్డ హిస్టారికల్ ఫిల్మ్ ‘సైరా’ చేశారు. ఈ ఏడాది ‘ఆచార్య’, ‘గాడ్ ఫాదర్’ సినిమాలతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. పైన చెప్పిన వివరాలు ఎందుకంటే.. టాక్ ఎలా ఉన్నా ‘సైరా’, ‘ఆచార్య’, ‘గాడ్ ఫాదర్’ సినిమాలు మూడు దారుణమైన నష్టాలను చవిచూశాయి. ‘ఆచార్య’ ఎఫెక్ట్ కి డిస్ట్రిబ్యూటర్స్ భయపడితే.. నిర్మాత డేర్ చేసి ఓన్ రిలీజ్ చేశారనే టాక్స్ వచ్చాయి.

కట్ చేస్తే ఇప్పుడు చిరు తర్వాత సినిమాకి మాత్రం క్రేజీ బిజినెస్ జరిగిందని ఫిలిం నగర్ సమాచారం. టాలీవుడ్ బిగ్గెస్ట్ ప్రొడక్షన్ హౌస్ మైత్రీ మూవీ మేకర్స్.. చిరు, డైరెక్టర్ బాబీల కాంబినేషన్ లో ఓ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. శృతి హాసన్ హీరోయిన్.

షూటింగ్ దాదాపు కంప్లీట్ కావొచ్చింది. దీపావళి నాడు టైటిల్ టీజర్ విడుదల చెయ్యున్నట్లు ప్రకటించారు. సంక్రాంతి రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నారు. మూడు నెలల ముందుగానే మేకర్స్ బిజినెస్ డీల్ క్లోజ్ చేసేశారు. తెలుగు రాష్ట్రాల్లో ఏ ఏరియా ఏ డిస్ట్రిబ్యూటర్ రైట్స్ తీసుకున్నారనే వివరాలు ఇలా ఉన్నాయి..

నైజాం : ఏషియన్ సునీల్

సీడెడ్ : అభిషేక్ రెడ్డి

ఉత్తరాంధ్ర : గాయత్రి దేవి ఫిల్మ్స్

ఈస్ట్ : వింటేజ్ క్రియేషన్స్

వెస్ట్ : ఆదిత్య ఫిల్మ్స్ LVR

గుంటూరు : ప్రైమ్ షో ఫిల్మ్స్

కృష్ణా : ధనుశ్రీ ఫిల్మ్స్

నెల్లూరు : భాస్కర్ రెడ్డి

కర్ణాటక : స్వాగత్

ఓవర్సీస్ : ఫార్స్ ఫిల్మ్స్..

కాంతార సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఎన్టీఆర్ – సావిత్రి టు చిరు- నయన్.. భార్యాభర్తలుగా చేసి కూడా బ్రదర్- సిస్టర్ గా చేసిన జంటలు..!
తన 44 ఏళ్ల కెరీర్లో చిరంజీవి రీమేక్ చేసిన సినిమాలు మరియు వాటి ఫలితాలు..!
సౌందర్య టు సమంత.. గర్భవతి పాత్రల్లో అలరించిన హీరోయిన్ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus