మహేష్ చిత్రం “ఓవర్సీస్”కు భారీ డిమాండ్!

సూపర్ స్టార్ మహేష్ బాబుకి విదేశాల్లోను ఎక్కువగా అభిమానులున్నారు. అక్కడ ప్రిన్స్ చిత్రాలు మంచి కలెక్షన్లు రాబట్టాయి. ఇక్కడ నిరాశపరిచిన వన్ – నేనొక్కడినే, బ్రహ్మోత్సవం సైతం అక్కడ డిస్ట్రిబ్యూటర్లకు లాభాలను తెచ్చిపెట్టింది. దీంతో మహేష్ చిత్రం ఓవర్సీస్ హక్కులను సొంతం చేసుకోవడానికి ఎగబడుతున్నారు. ప్రస్తుతం తమిళ డైరక్టర్ మురుగదాస్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న సినిమా కోసం ఇప్పటి నుంచే సంప్రదింపులు మొదలైపోయాయి. వీరిద్దరిది క్రేజీ కాంబినేషన్. కాసులు కురిపించే కలయిక.

అందుకే 15 నుంచి 18 కోట్లు ఇవ్వడానికి ముందుకు వస్తున్నారు. కానీ చిత్ర నిర్మాతలు ఎం.వి.ప్రసాద్, ఠాగూర్ మధులు ఇంకా ఎక్కువగా ఆశిస్తున్నట్లు తెలిసింది. ఈ సినిమా వచ్చే వేసవికి రిలీజ్ కానుంది. చాలా టైమే ఉంది కాబట్టి ప్రొడ్యూసర్లు తొందర పడడం లేదు. మంచి బేరం కోసం ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం రెండో షెడ్యూల్ జరుగుతోంది. ఈ చిత్రీకరణలో ఫిట్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్  రెండు రోజుల క్రితం జాయిన్ అయింది.

హీరో హీరోయిన్ల మధ్య రొమాంటిక్  సీన్లు తెరకెక్కిస్తున్నారు. ఈ వారం షూటింగ్ అనంతరం కొన్ని రోజులు గ్యాప్ ఉండనుంది. మురుగ దాస్ తన అఖీరా సినిమా ప్రమోషన్లో బిజీ కానున్నారు. ఆ తర్వాత చైన్నై లో మహేష్ మూవీ మూడో షెడ్యూల్ మొదలు కానుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus