‘బ్రో’ సినిమా రిలీజ్ అయ్యింది. వారం రోజులు బాక్సాఫీస్ వద్ద సందడి చేసింది. తర్వాత డౌన్ అయిపోయింది. మరోపక్క ‘బ్రో’ గురించి పొలిటికల్ లీడర్స్ కూడా మాట్లాడటం .. ఇంకా ప్రమోషన్ చేసినట్టు అయ్యింది కానీ.. సినిమాకి రెండో వీకెండ్ కు టికెట్లు అయితే తెగలేదు. ఫైనల్ గా ఈ సినిమా వల్ల డిస్ట్రిబ్యూటర్లకు నష్టాలు తప్పవని ట్రేడ్ పండితులు తేల్చేసారు. అయితే ఈ సినిమా వల్ల పవన్ ఇమేజ్ కి , సాయి ధరమ్ తేజ్ కి .. వచ్చే నష్టమేమీ లేదు.
డైలాగ్ వెర్షన్ రాసిన త్రివిక్రమ్.. మహేష్ తో ‘గుంటూరు కారం’ సినిమా చేసుకుంటున్నాడు. సో ఎటొచ్చి ఈ సినిమా సక్సెస్ పై బోలెడన్ని ఆశలు పెట్టుకుంది హీరోయిన్ కేతిక శర్మ, దర్శకుడు సముద్రఖని అని చెప్పాలి. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, విలన్ గా బిజీగా గడుపుతున్న సముద్రఖనికి పవన్ కళ్యాణ్ ను డైరెక్ట్ చేసే అవకాశం రావడం.. అది 10 ఏళ్ళ తర్వాత అంటే చిన్న విషయం కాదు.
కానీ ఆ అవకాశాన్ని అతను పూర్తిగా సద్వినియోగ పరుచుకోలేకపోయాడు. (Bro Movie) ‘బ్రో’ కనుక సక్సెస్ అయ్యుంటే అతనికి ఇంకో స్టార్ హీరోతో లేదా మిడ్ రేంజ్ హీరోతో దర్శకుడిగా సినిమా చేసే అవకాశం దక్కేది. ఇప్పుడైతే ఆ ఛాన్స్ లేదు. మరోపక్క హీరోయిన్ కేతిక శర్మ కూడా ఈ సినిమా పై ఎక్కువ ఆశలే పెట్టుకుంది.ఈ సినిమా హిట్ అయితే.. టాలీవుడ్లో కొన్నాళ్ళు బిజీ హీరోయిన్ గా రాణించే అవకాశం ఉండేది. కానీ ఈసారి కూడా ఆమెకి చేదు ఫలితం తప్పలేదు.
ఆ హీరోల భార్యల సంపాదన ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
రాంచరణ్ టు నాని.. ఈ 10 మంది హీరోలకి మొదటి వంద కోట్ల సినిమాలు ఇవే..!
పాత్ర కోసం ఇష్టాలను పక్కన పడేసిన నటులు వీళ్లేనా..!