మెగాహీరోకి పెద్ద సవాలే!

ఒక కొత్త హీరో, హీరోయిన్, డైరెక్టర్ కలిసి సినిమా చేస్తున్నారంటే ఆశించిన స్థాయిలో హైప్ రాదు. కానీ ‘ఉప్పెన’ సినిమా విషయంలో అలా కాదు. ఈ సినిమాను చూడడానికి ఆడియన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి చిన్న మేనల్లుడు హీరోగా పరిచయమవుతున్నాడు. కృతిశెట్టి అనే కొత్త అమ్మాయి హీరోయిన్ గా నటించింది. సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు ఈ సినిమాతో దర్శకుడిగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఈ సినిమా అనౌన్స్ చేసినప్పుడు పెద్ద హైప్ లేదు కానీ ప్రోమోలు, సినిమాలో పాటలు ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో సినిమాపై ఇంట్రెస్ట్ పెరిగింది.

గతేడాదితో విడుదల కావాల్సిన సినిమా పది నెలలు ఆలస్యంగా రిలీజ్ అవుతున్నా.. హైప్ ఎంతమాత్రం తగ్గలేదు. ఇక రీసెంట్ గా విడుదలైన ట్రైలర్ సినిమాపై అంచనాలు అమాంతం పెంచేసింది. ఒక స్టార్ హీరో సినిమా రేంజ్ లో ఈ సినిమాపై బజ్ క్రియేట్ అయింది. రీసెంట్ గా జరిగిన సినిమా ప్రీరిలీజ్ ఫంక్షన్ దానికి కారణం అని చెప్పొచ్చు. మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు సుకుమార్, కొరటాల శివ, సందీప్ రెడ్డి వంగ, హరీష్ శంకర్ ఇలాంటి అగ్ర దర్శకులంతా ఈ ఈవెంట్ కి హాజరై సినిమా గురించి గొప్పగా మాట్లాడారు.

సుక్కు వంద కోట్ల సినిమా అని పొగిడేస్తే.. చిరంజీవి మరో రంగస్థలం అవుతుందని, భారతీరాజా సినిమాల ఉందంటూ పొగడ్తలతో ముంచెత్తారు. అందరి స్పీచ్ లతో సినిమాపై హైప్ ఓ రేంజ్ లో పెరిగిపోయింది. ఈ హైప్ అంతా ఓపెనింగ్స్ తీసుకురావడంలో సహాయం చేస్తుంది. కానీ ఈ రేంజ్ లో అంచనాలు ఉంటే వాటిని రీచ్ అవ్వడం అంత సులువైన విషయం కాదు. మెగాహీరోకి ఇది పెద్ద ఛాలెంజ్ అనే చెప్పాలి. మరి సినిమాకి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి!

Most Recommended Video

జాంబీ రెడ్డి సినిమా రివ్యూ & రేటింగ్!
తెలుగులో క్రేజ్ ఉన్న ఈ 10 యాంకర్ల వయసు ఎంతో మీకు తెలుసా
శృతీ ఈ సినిమాలను రిజెక్ట్ చేసి మంచి పనే చేసిందా..?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus