టాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్ మంచి కథల కోసం పొరుగు పరిశ్రమలవైపు చూసేవారు. అక్కడ విజయం సాధించిన కథలను భారీ ధరకు కొనుగోలు చేసి చిత్రీకరించారు. రెండేళ్ల నుంచి ఈ విధానం రివర్స్ అయింది. ఇక్కడి కథల కోసం కోలీవుడ్ మాత్రమే కాదు.. బాలీవుడ్ సైతం క్యూ కడుతోంది. ముఖ్యంగా చిన్న చిత్రంగా వచ్చి పెద్ద హిట్ సాధించిన వాటి హక్కులకు ఎగపడుతున్నారు. క్షణం సినిమాని బాలీవుడ్ లో రీమేక్ చేసిన సంగతి తెలిసిందే. రీసెంట్ గా హిట్ కొట్టిన అర్జున్ రెడ్డిని తమిళంలో రీమేక్ చేస్తున్నారు. బాలీవుడ్ లో స్వయంగా సందీప్ రెడ్డి రీమేక్ చేస్తున్నారు. తాజాగా టాలీవుడ్ లో “ఆర్ఎక్స్ 100” సంచలనం విజయం సాధించింది.
రెండు కోట్లతో నిర్మితమైన ఈ మూవీ రెండు రోజుల్లోనే బడ్జెట్ ని రాబట్టింది. ఆరు రోజుల్లో దాదాపు 7 కోట్ల షేర్ వసూలు చేసి దూసుకుపోయింది. ఈ చిత్రంపై బాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్ కన్నుపడింది. దీనిని రీమేక్ చేయాలనీ ఫిక్స్ అయ్యారు. రీమేక్ హక్కుల కోసం బాలీవుడ్ లోని ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థలు పోటీ పడుతున్నాయి. భారీ ధరకు ఈ మూవీ హక్కులు అమ్ముడుపోవడం గ్యారంటీ అని ట్రేడ్ వర్గాలవారు తెలిపారు. ఈ సినిమాకి ఉన్న క్రేజ్ ని బట్టి శాటిలైట్ హక్కులు ఆరుకోట్ల పలుకుతున్నారు. మరి రీమేక్ హక్కులు ఎంత పలుకుతాయో చూడాలి.