Adipurush: ఆ సినిమా వల్ల ఆదిపురుష్ మూవీకి భారీ స్థాయిలో నష్టమా?

మరికొన్ని రోజుల్లో విడుదల కానున్న ఆదిపురుష్ మూవీ విడుదలకు ముందు విడుదలకు తర్వాత సంచలనాలు సృష్టించడం ఖాయమని కామెంట్లు వినిపిస్తున్నాయి. మైథలాజికల్ సినిమాగా తెరకెక్కినా ఈ సినిమాకు రికార్డ్ స్థాయిలో బిజినెస్ జరగడం గమనార్హం. అయితే ఓవర్సీస్ లో మాత్రం ఆదిపురుష్ మూవీకి భారీ షాక్ తగిలిందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తుండటం గమనార్హం. నాని దసరా మూవీతో పోల్చి చూస్తే ఆదిపురుష్ మూవీ తక్కువ థియేటర్లలో తక్కువ లొకేషన్లలో విడుదల కానుందని సమాచారం అందుతోంది.

రిలీజ్ డేట్ విషయంలో చేసిన పొరపాటు వల్ల ఈ విధంగా జరుగుతోందని సమాచారం అందుతోంది. దసరా మూవీ 200 లొకేషన్లలో విడుదల కాగా ఆదిపురుష్ మూవీ 130 లొకేషన్లలో విడుదల కానుందని ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ మొదలయ్యాయని సమాచారం. హాలీవుడ్ మూవీ ది ఫ్లాష్ రిలీజ్ అవుతుండటంతో ఆదిపురుష్ మూవీకి తక్కువ సంఖ్యలో థియేటర్లు దక్కుతున్నాయి. మరోవైపు ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది.

ప్రీ రిలీజ్ ఈవెంట్ వల్ల (Adipurush) ఈ సినిమాపై ఏర్పడ్డ అంచనాలు రెట్టింపు అయ్యాయి. ఆదిపురుష్ మూవీ 600 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కగా ఈ సినిమాకు 700 కోట్ల రూపాయల నుంచి 800 కోట్ల రూపాయల రేంజ్ లో బిజినెస్ జరుగుతోంది. టీ సిరీస్ కొన్ని ఏరియాలలో ఈ సినిమాను సొంతంగా రిలీజ్ చేసుకుంటోంది. ప్రభాస్ సినీ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కిన సినిమాగా ఈ సినిమా నిలిచింది.

ప్రభాస్ నటిస్తున్న సలార్, ప్రాజెక్ట్ కే సినిమాలు రాబోయే 7 నెలల్లో థియేటర్లలో విడుదల కానున్నాయి. ఈ రెండు సినిమాలు ప్రభాస్ మార్కెట్ ను రెట్టింపు చేయడంతో పాటు ప్రభాస్ క్రేజ్ ను భారీగా పెంచుతాయని అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. ఇతర భాషల్లో సైతం ప్రభాస్ అంచనాలకు మించి సక్సెస్ సాధించడంతో పాటు సత్తా చాటాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

ప్రేక్షకులను థియేటర్ కు రప్పించిన సినిమాలు ఇవే..!
ప్రభాస్, పవన్ కళ్యాణ్ లతో పాటు అభిమానుల చివరి కోరికలు తీర్చిన స్టార్ హీరోలు!

టాలెంట్ కు లింగబేధం లేదు..మహిళా డైరక్టర్లు వీళ్లేనా?
పిల్లలను కనడానికి వయస్సు అడ్డుకాదంటున్న సినీతారలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus