Prashanth Neel: సలార్ మూవీ ఆ సినిమాను మించి ఉంటుందా?

  • April 23, 2022 / 08:13 PM IST

ఉగ్రమ్ సినిమాతోనే తొలి సక్సెస్ ను సొంతం చేసుకున్నా కేజీఎఫ్, కేజీఎఫ్2 సినిమాలతోనే ప్రశాంత్ నీల్ ఖాతాలో బ్యాక్ టు బ్యాక్ పాన్ ఇండియా హిట్లు చేరాయి. ప్రస్తుతం దేశమంతటా ప్రశాంత్ నీల్ గురించి చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో నటించడానికి బాలీవుడ్ స్టార్లు సైతం ఆసక్తి చూపుతున్న విషయం తెలిసిందే. ప్రశాంత్ నీల్ తర్వాత సినిమా ప్రభాస్ హీరోగా సలార్ పేరుతో తెరకెక్కుతోంది.

Click Here To Watch NOW

అయితే ప్రభాస్ ఫ్యాన్స్ నుంచి ప్రశాంత్ నీల్ పై ఊహించని స్థాయిలో ఒత్తిడి పెరుగుతోందని తెలుస్తోంది. ఇప్పటికే సలార్ మూవీ షూటింగ్ 30 శాతం పూర్తి కాగా సలార్ మూవీలో కేజీఎఫ్2 సినిమాను మించి ఎలివేషన్లు ఉండాలని ప్రభాస్ అభిమానులలో కొందరు కామెంట్లు చేస్తున్నారు. కేజీఎఫ్2 సినిమా కంటే సలార్ మూవీ బడ్జెట్ ఎక్కువ కాగా ఈ సినిమాతో కూడా భారీ బ్లాక్ బస్టర్ హిట్ ను సాధించాల్సిన బాధ్యత ప్రశాంత్ నీల్ పై ఉంది.

మరోవైపు ప్రభాస్ సైతం బాహుబలి2 సక్సెస్ తర్వాత కెరీర్ విషయంలో ఒడిదొడుకులు ఎదుర్కొంటున్నారు. సాహో, రాధేశ్యామ్ సినిమాలు ఫ్లాప్ కావడంతో పాటు అభిమానులను తీవ్రస్థాయిలో నిరాశపరిచాయనే సంగతి తెలిసిందే. ప్రభాస్ మొదట సలార్ సినిమానే విడుదల చేయాలని మరి కొందరు అభిమానులు కోరుకుంటున్నారు. మే తొలి వారం నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది.

సలార్ సినిమా వచ్చే ఏడాది సమ్మర్ లో విడుదల కానుందని వార్తలు వస్తున్నాయి. ప్రభాస్ కెరీర్ లో ఈ సినిమా స్పెషల్ మూవీగా నిలుస్తుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ప్రభాస్ కు జోడీగా ఈ సినిమాలో శృతి హాసన్ నటిస్తున్నారు. ప్రభాస్ తర్వాత సినిమాలు కూడా పాన్ ఇండియా సినిమాలుగా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్నాయి. ప్రభాస్ కెరీర్ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ఒక్కో సినిమాకు 100 కోట్ల రూపాయలకు అటూఇటుగా ప్రభాస్ రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు.

‘కె.జి.ఎఫ్2’ నుండీ అదిరిపోయే 23 డైలాగులు ఇవే..!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
తెలుగులో అత్యధిక థియేట్రికల్ బిజినెస్ చేసిన సినిమాల లిస్ట్..!
‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు బాక్సాఫీస్ వద్ద భారీ లాభాలను అందించిన 10 సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus