అందాల ప్రదర్శన తమన్నాకు ఓ హద్దు ఉంటుంది. అలా అని చెప్పి స్కిన్ షో చేయదు అని కాదు. ఆమె డ్రెస్సింగ్ సెన్స్, డ్రెస్‌లలోనే ఆ మ్యాజిక్ ఉంటుంది. చూపించీ చూపించకుండా అందాల ప్రదర్శన చేయడంలో ఆమె దిట్ట. ఈ మధ్య కాస్త అందాల ప్రదర్శనకు గేట్లు ఓపెన్ చేసినా.. ఇంకా దాగుడుమూతల గేమ్ బాగానే ఆడుతోంది. తాజాగా ఓ గ్లామర్ ఈవెంట్‌కి వచ్చిన ఈ మిల్కీ బ్యూటీ ధరించిన డ్రెస్ ధర, లుక్ అదిరిపోయాయి. దీంతో ఇప్పుడు దాని గురించే అందరూ మాట్లాడుకుంటున్నారు.
సమంతకు చెందిన ఓ లగ్జరీ పెర్ఫ్యూమ్ బ్రాండ్ లాంచ్ ఈవెంట్‌కి తమన్నా భాటియా కూడా హాజరైంది. మిడీ లాంటి ఓ గౌన్ ధరించి వచ్చినవాళ్లకు పెర్ఫ్యూమ్‌ని మించిన మత్తులో ముంచేసింది. ఇక ధర విషయానికొస్తే.. ఆ గౌను ధర ₹66,300. చూడ్డానికి సింపుల్‌గానే ఉన్నా.. తమన్నా లాంటి మిల్కీ వైట్ బాడీకి భలేగా సెట్ అయింది అని చెప్పాలి. సింఖాయ్ అనే లగ్జరీ బ్రాండ్ దీన్ని రూపొందించింది. కాటన్‌తో తయారుచేసిన ఈ గౌను మోకాళ్ల కింద నుంచి ట్రాన్స్‌పరెంట్‌గా ఉంటుంది.
ఇక సినిమాల విషయానికొస్తే.. ఆమె చివరిసారిగా ‘ది బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్’ వెబ్‌సిరీస్‌లో ఓ ఐటెమ్ సాంగ్‌లో కనిపించింది. ఇక సిద్ధార్థ్ మల్హోత్రా హీరోగా తెరకెక్కనున్న ఓ సినిమా నటించబోతోంది. అటవీ నేపథ్యంలో సాగబోయే ఈ కథలో గిరిజన మహిళగా తమన్నా కనిపిస్తుందని సమాచారం. కొన్ని నెలల క్రితం వరకు విజయ్ వర్మతో ప్రేమలో ఉన్న తమన్నా.. ఇప్పుడు మళ్లీ సింగిల్ అయిపోయింది. దీని వెనుక కారణాలు తెలియకపోయినా.. ఒకరి మీద ఒకరు విసుర్లు అయితే వేసుకుంటున్నారు.
గతేడాది ‘ఓదెల 2’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు హాయ్ చెప్పిన తమన్నా.. ఆ సినిమా ఎఫెక్టో ఏమో తర్వాత ఇంకే సినిమాకు సైన్ చేయలేదు. రెండేళ్ల క్రితం చేసిన ‘భోలా శంకర్’ కూడా ఆమెకు ఇబ్బందికర ఫలితాన్నే అందించిన విషయం తెలిసిందే.