నాగచైతన్య, సమంతల క్రేజ్ కి తగ్గట్టు పారితోషికం

సమంత, నాగ చైతన్య పెళ్లి కాకముందు ‘ఏ మాయ చేశావే’ .. ‘ఆటో నగర్ సూర్య’ .. ‘మనం ‘ చిత్రాల్లో నటించారు. పెళ్లి అయిన తర్వాత తొలిసారి కలిసి నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ‘నిన్నుకోరి’ హిట్ తో మంచి పేరు తెచ్చుకున్న శివ నిర్వాణ దర్శకత్వంలో పని చేయనున్నారు. సో తొలిసారి కావడంతో ఈ చిత్రానికి భారీ క్రేజ్ ఉంటుంది. ఆ క్రేజ్ కి తగ్గట్టుగానే రెమ్యునరేషన్ అందుకోబోతున్నట్టు తెలిసింది. చైతూ సినిమాకి మూడు కోట్లు అందుకుంటారు. సమంత ఒకటిన్నర కోటీ తీసుకుంటుంది.

అయితే ఈ సినిమాకి మాత్రం ఉమ్మడిగా ఏడు కోట్లు డిమాండ్ చేసినట్లు సమాచారం. అంత ఇవ్వడానికి నిర్మాత ఒకే చెప్పిన తర్వాతే ఈ ప్రాజెక్ట్ పై ఇద్దరూ సంతకాలు చేసారంట. ప్రస్తుతం నాగ చైతన్య ‘సవ్యసాచి’ .. ‘శైలజా రెడ్డి అల్లుడు’ సినిమాలతో బిజీగా ఉన్నారు. సమంత ‘రంగస్థలం’ పూర్తి చేసి ‘మహానటి’, యూ టర్న్ చిత్రాల కోసం కష్టపడుతోంది. ఈ సినిమాల తర్వాత క్రేజీ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లనుంది. షైన్ స్క్రీన్ బ్యానర్ పై నిర్మితం కానున్న ఈ సినిమా గురించి పూర్తి వివరాలు త్వరలో అధికారికంగా ప్రకటించనున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus