Coolie & War2 – హైప్ చెక్: కూలి వర్సెస్ వార్ 2

నిన్న సాయంత్రం వరకు టికెట్ రేట్స్ విషయంలో క్లారిటీ లేక బుకింగ్స్ ఓపెన్ అవ్వక రజనీకాంత్, ఎన్టీఆర్ ఫ్యాన్స్ చాలా ఇబ్బందిపడ్డారు. కట్ చేస్తే.. నిన్న సాయంత్రం బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. కూలి, వార్2 సినిమాలు పోటీపడి మరీ టికెట్ బుకింగ్ యాప్స్ లో ట్రెండ్ అవుతున్నాయి. అయితే.. ఎవరిది పైచేయి అంటే మాత్రం ప్రస్తుతానికి అందరూ కూలి అనే చెప్పాలి. ఎందుకంటే బుకింగ్స్ చూసుకున్నా, హైప్ చూసుకున్నా “కూలి” ఒక మెట్టు పైనే ఉంది.

Coolie Vs War 2


అలాగని “వార్ 2”ని కూడా తీసిపారేయడానికి లేదు. ముందుగా బాలీవుడ్ డబ్బింగ్ సినిమాగా “వార్ 2”కి కేటగరైజ్ చేసినప్పటికీ.. మొన్న నిర్వహించిన ప్రీరిలీజ్ ఈవెంట్లో ఎన్టీఆర్ స్పీచ్ తర్వాత సినిమా క్రేజ్ ఒక్కసారిగా పెరిగింది. మరీ ముఖ్యంగా దీన్ని డబ్బింగ్ సినిమాగా కాక ఒక స్ట్రయిట్ తెలుగు సినిమాలా ట్రీట్ చేయడం మొదలుపెట్టారు. మొదటిరోజు థియేటర్ల నెంబర్ వరకు “కూలి”కి ఎక్కువ ఇచ్చినప్పటికీ.. “వార్ 2”కి మల్టీప్లెక్స్ చైన్ లో మంచి థియేటర్లు లభించాయి. రెండుమూడు రోజుల్లో అవి పెరిగే అవకాశాలున్నాయి.


అయితే.. ముందు పేర్కొన్నట్లుగా “వార్ 2” కంటే “కూలీ”కి మంచి హైప్ ఉంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల నుంచి ఆర్టిస్టులు ఉండడం, అనిరుధ్ బీజీయం, లోకేష్ కనగరాజ్ బ్రాండ్ అన్నీ కలగలిసి “కూలీ”ని కాస్త టాప్ పొజిషన్ లో పెట్టాయి. ఓపెనింగ్స్ విషయంలోనూ “కూలి” పైచేయి కచ్చితంగా ఉంటుంది. అయితే.. రేపు రిజల్ట్ తర్వాత కలెక్షన్స్ ఎలా ఉంటాయి అనేది తెలుస్తుంది. అప్పుడు అసలు పైచేయి ఎవరిది అనే విషయంలో ఒక క్లారిటీ వస్తుంది. తెలంగాణాలో టికెట్ హైక్స్ లేకపోవడం అనేది తెలుగు రాష్ట్రాల రైట్స్ తీసుకున్న నిర్మాతలకు కాస్త మైనస్ అయ్యింది. దాన్ని లాంగ్ రన్ లో సాధించగలరో లేదో చూడాలి.

ఆ రీజన్ తో ‘కె.జి.ఎఫ్’ ని ఆ స్టార్ హీరో రిజెక్ట్ చేశాడు.. నిర్మాత షాకింగ్ కామెంట్స్

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus