Bigg Boss 7 Telugu: హౌస్ లో దసరా సంబరాలు ..! హోస్ట్ మారాడా ? ఏం జరగబోతోందంటే..,

బిగ్ బాస్ హౌస్ లో ప్రస్తుతం దసరా స్పెషల్ ఎపిసోడ్ కోసం రంగం సిద్ధం అయ్యింది. ఆదివారం 7 గంటల నుంచే ఈ ఎపిసోడ్ టెలికాస్ట్ అవుతుంది. శనివారం ఎపిసోడ్ శుక్రవారమే కంప్లీట్ చేశారు. నిజానికి దసరా స్పెషల్ కోసం హోస్ట్ ని మారుద్దామని అనుకున్నారట. కానీ , నాగార్జునే ఈ ఎపిసోడ్ ని డీల్ చేయబోతున్నారు. సినిమా ప్రమోషన్స్ కోసం సెలబ్రిటీస్ దసరా స్పెషల్ లో భాగంగా రాబోతున్నారు. ప్రతిసారి లాగానే హైపర్ ఆదిని రంగంలోకి దింపాలని చూస్తున్నారు. అయితే, ఈ దసరాకి సుమ కొడుకు సినిమా బబుల్ గమ్ ప్రమోషన్స్ కోసం సుమ రాబోతోందనే టాక్ సోషల్ మీడియాలో వినిపిస్తోంది.

హైపర్ ఆది – సుమ వీరిద్దరిలో ఒకరు ఖచ్చితంగా బిగ్ బాస్ స్టేజ్ పైన దుమ్మురేపేందుకు రెడీ అవుతున్నారు. ఇప్పటికే ఓంకార్ అన్నయ్య బిగ్ బాస్ హౌస్ లో సందడి చేసినట్లుగా తెలుస్తోంది. మాన్షన్ వెబ్ సీరిస్ ప్రమోషన్స్ లో భాగంగా ఓంకార్ , ఇంకా సినిమా టీమ్ బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లి హౌస్ మేట్స్ తో ఫన్ గేమ్స్ ఆడారు. ఇది శుక్రవారం టెలికాస్ట్ చేసే అవకాశం ఉంది. లేదా శనివారం నాగార్జున ఎపిసోడ్ లో ఇది టెలికాస్ట్ చేస్తారు. ఇక బిగ్ బాస్ దసరా ఎపిసోడ్స్ కోసం చాలామంది సెలబ్రిటీలు రాబోతున్నారు.

బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్స్ నుంచీ పాటలు, డ్యాన్స్ లు కూడా ఉండబోతున్నాయ్. దసరా సెలబ్రేషన్స్ కాబట్టి ఈవారం ఎలిమినేషన్ ఉంటుందా ? లేదా అనేది సందేహంగా మారింది. ఒకవేళ ఎలిమినేషన్ తీసేస్తే మాత్రం ఖచ్చితంగా హౌస్ మేట్స్ కి పండగనే చెప్పాలి. అలా కాకుండా పండగ రోజు డబుల్ ఎలిమినేషన్ పెడితే ఇద్దరు హౌస్ మేట్స్ ఇంటికి వెళ్లిపోక తప్పదు. ఎందుకంటే, ఇప్పటికే రీ ఎంట్రీలో భాగంగా రతిక హౌస్ లోకి అడుగు పెట్టబోతోంది. అందుకే, డబుల్ ఎలిమినేషన్ అనేది ఖచ్చితంగా ఒకవారం చేయాల్సి ఉంటుంది.

దసరా సంబరాల్లో భాగంగా లైవ్ పెర్ఫామన్స్, పాటలు, బిగ్ బాస్ హౌస్ లోకి సెలబ్రిటీలు రాబోతున్నారు. ఇక దీనికోసం శనివారం మొత్తం షూటింగ్ కి కేటాయించారు. గతంలో దసరా ఎపిసోడ్స్ కోసం రమ్యకృష్ణ, సమంత ఇద్దరూ వచ్చి యాంకరింగ్ చేశారు. ఇప్పుడు కూడా అలాగే హోస్ట్ ని మారుస్తారనేది సోషల్ మీడియాలో టాక్ నడించింది. కానీ, నాగార్జునే శనివారం ఇంకా ఆదివారం దసరా స్పెషల్ ఎపిసోడ్ ని లీడ్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన షూటింగ్ కూడా ఫినిష్ అవుతోంది. ఇక హౌస్ లో ఈవారం (Bigg Boss 7 Telugu) కెప్టెన్ గా అర్జున్ అంబటి అయిన సంగతి తెలిసిందే. అదీ మేటర్.

‘బిగ్ బాస్ 7’ వైల్డ్ కార్డ్ ఎంట్రీ నయనీ పావని గురించి 10 ఆసక్తికర విషయాలు!

‘పుష్ప’ టు ‘దేవర’.. 2 పార్టులుగా రాబోతున్న 10 సినిమాలు..!
‘బిగ్ బాస్ 7’ వైల్డ్ కార్డ్ ఎంట్రీ అశ్విని శ్రీ గురించి 10 ఆసక్తికర విషయాలు!

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus