Hyper Aadi: పవన్ కు తానెప్పుడూ సపోర్ట్ చేస్తానన్న హైపర్ ఆది!

స్టార్ హీరో పవన్ కళ్యాణ్ కొన్నేళ్ల క్రితం జనసేన పార్టీని స్థాపించిన సంగతి తెలిసిందే. 2019 ఎన్నికల్లో ఈ పార్టీ ఏపీలో వందకు పైగా అసెంబ్లీ స్థానాలలో పోటీ చేసినా ఆశించిన స్థాయిలో ఫలితాలు మాత్రం రాలేదు. పవన్ కళ్యాణ్ రెండు అసెంబ్లీ స్థానాల నుంచి పోటీ చేసినా రెండు ప్రాంతాలలో గెలవలేదు. అయితే ఆ పార్టీ తరపున పోటీ చేసిన రాపాక వరప్రసాద్ తూర్పు గోదావరి జిల్లా రాజోలు నియోజకవర్గం నుంచి గెలవడంతొ పాటు జనసేన పార్టీకి ఏకంగా 7 శాతం ఓట్లు వచ్చాయి.

2024 సంవత్సరంలో జరిగే ఎన్నికల్లో మాత్రం జనసేన పార్టీ మెరుగైన ఫలితాలను నమోదు చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. టీడీపీ జనసేనతో కలిసి ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రముఖ జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆది సైతం తాజాగా ఒక సందర్భంలో భవిష్యత్తులో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తే జనసేన పార్టీలో చేరతానని చెప్పుకొచ్చారు. పవన్ కళ్యాణ్ పై అభిమానాన్ని ఆది ఈ విధంగా చాటుకున్నారు. 2019 ఎన్నికల సమయంలో జనసేన పార్టీకి మద్దతు తెలపడంతో పాటు ఆ పార్టీకి ప్రచారం చేసిన హైపర్ ఆది పవన్ కళ్యాణ్ కు ఎల్లప్పుడూ తన మద్దతు ఉంటుందని పేర్కొన్నారు.

పవన్ ఏ పని చేసినా ఆ పని రైట్ అని హైపర్ ఆది కామెంట్లు చేశారు. పవన్ కొరకు ఎన్ని సంవత్సరాలైనా తాము సపోర్ట్ చేస్తామని ఆది కామెంట్లు చేశారు. పవన్ కళ్యాణ్ అధికారంలోకి రావడం లేట్ అయినా అధికారంలోకి కచ్చితంగా వస్తారని ఆది పేర్కొన్నారు. జనసేన పార్టీ సైనికుల్లో ఉత్సాహం నింపేలా హైపర్ ఆది చేసిన కామెంట్లు వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం జబర్దస్త్, ఇతర రియాలిటీ షోలతో హైపర్ ఆది బిజీగా ఉన్నారు.

సినిమాలలో కూడా హైపర్ ఆదికి భారీగా ఆఫర్లు వస్తున్నాయి. హైపర్ ఆది స్కిట్లు యూట్యూబ్ లో మంచి వ్యూస్ ను సొంతం చేసుకుంటున్నాయి.

2021.. ఇండస్ట్రీని వివాదాలతో ముంచేసింది!

Most Recommended Video

ఈ ఏడాది హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చిన భామల లిస్ట్..!
ఈ ఏడాది ప్లాపుల నుండీ బయటపడ్డ హీరోలు ఎవరో తెలుసా?
ఈ ఏడాది వివాహం చేసుకున్న సినీ సెలబ్రిటీలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus