Hyper Aadi: అన్న మంచోడు ముంచేశారు… తమ్ముడు మొండోడో వదిలిపెట్టడు: హైపర్‌ ఆది

చిరంజీవి ఎదురుగా నిలబడి… మాట్లాడటానికి భయం భయంగా ఉంటారు నటులు. అలాంటి చిరంజీవి ముందు ఏకంగా పది నిమిషాలకుపైగా మాట్లాడాడు హైపర్‌ ఆది. మాట్లాడాడు అనే కంటే.. మాటలతో ఊచకోత కోశాడు అని చెప్పాలి. అంతగా ఎవరిని ఆడేసుకున్నాడు అంటారా? ఒకరిని ఏంటి… చిరంజీవి ఫ్యామిలీని చాలా రోజులుగా సూటిపోటి మాటలతో విరుచుకుపడుతున్న వారిని… కుటుంబం మీద అక్కసు వెళ్లగక్కుతున్న వారిని ఆటాడుకున్నాడు అని చెప్పాలి. మెగాస్టార్‌ చిరంజీవి ప్రధాన పాత్రలో నటించిన ‘భోళా శంకర్’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్ ఇటీవల హైదరాబాద్‌లో జరిగింది.

ఆ సినిమాలో ఓ చిన్న పాత్ర వేసిన (Hyper Aadi) హైపర్‌ ఆది.. స్టేజీ ఎక్కగానే అభిమానుల్లో చిన్న సందడి నెలకొంది. కచ్చితంగా హేటర్స్‌కు పంచ్‌లు పడతాయి అని ముందుగానే ఎక్స్‌పెక్ట్‌ చేశారు. ఈ క్రమంలో హైపర్‌ ఆది కొన్ని వివాదాస్పద అంశాలను టచ్ చేశాడు. ‘‘కొందరు తెలివైన శాడిస్టులు ఉంటారు.. అన్నయ్యని పొగుడుతూ తమ్ముడిని తిడతారు’’ అంటూ పొలిటికల్‌ టచ్‌ కూడా చేశాడు. అన్నయ్య మంచోడు కాబట్టే ముంచేశారు.. కానీ తమ్ముడు మొండోడు..

అన్నయ్యని తిట్టిన ప్రతి ఒక్కరికి వడ్డీతో సహా ఇచ్చేస్తారు అంటూ పొలిటికల్‌గా చిరంజీవికి ఎదురైన ఇబ్బందులు, పవన్‌ పరిస్థితి గురించి మాట్లాడాడు. ‘భోళా శంకర్’ సినిమా కోసం నిర్మాతలు పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ మధ్యన ఎలక్షన్స్ గురించి మాట్లాడాల్సిన వాళ్లు కలెక్షన్స్ గురించి మాట్లాడుతున్నారు. వాళ్లు వెనకేసుకున్న కలెక్షన్లతో పోల్చుకుంటే మన కలెక్షన్స్ తక్కువే అంటూ ‘బ్రో’ సినిమా విషయంలో జరుగుతున్న రచ్చను ప్రస్తావించాడు. ‘‘ప్రతి ఇంట్లో ‘ఫ్యాన్’ ఉంటుందో లేదో తెలియదు గానీ ఒక్కరైనా చిరంజీవి ఫ్యాన్ ఉంటాడు..

నా దృష్టిలో సచిన్, చిరంజీవి ఒక్కటే. క్రికెట్‌లో విమర్శలు వస్తే సచిన్ బ్యాట్‌తో సమాధానం ఇస్తాడు. సినిమాల్లో విమర్శలు వస్తే చిరంజీవి గారు సినిమాలతోనే సమాధానం ఇస్తాడు. ‘ఆచార్య’ సినిమాతో విమర్శలు వస్తే… ‘వాల్తేరు వీరయ్య’ సినిమాతో సమాధానం ఇచ్చాడు అని చిరు సినిమాల ఫలితాల గురించి మాట్లాడాడు. రాజకీయాల్లోకి రాకముందు బ్లడ్ బ్యాంకుల సేవలకు అవార్డులు ఇచ్చాయి.

కానీ రాజకీయాల్లోకి వచ్చాక అదే ప్రభుత్వాలు బ్లడ్ బ్యాంకుల మీద విమర్శలు చేశాయి అంటూ బ్లడ్‌ బ్యాంకు మీద వచ్చిన విమర్శలకు సమాధానం ఇచ్చాడు. సచిన్ కొడుకు సచిన్ కాలేదు, అమితాబ్ బచ్చన్ కొడుకు అమితాబ్ కాలేదు, కానీ చిరంజీవి కొడుకు చిరంజీవి అయ్యాడు అంటూ చరణ్ ఎంట్రీ టైమ్‌లో వచ్చిన పుకార్ల గురించి కౌంటర్‌ ఇచ్చాడు. అలాగే ఫ్యాన్‌, వ్యూహం అంటూ ఏపీలోని అధికార పార్టీకి పంచ్‌లు వేశాడు.

ఆ హీరోల భార్యల సంపాదన ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

రాంచరణ్ టు నాని.. ఈ 10 మంది హీరోలకి మొదటి వంద కోట్ల సినిమాలు ఇవే..!
పాత్ర కోసం ఇష్టాలను పక్కన పడేసిన నటులు వీళ్లేనా..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus