Hyper Aadi: ఆర్ఆర్ఆర్ సినిమా పై హైపర్ ఆది సెటైర్స్!

హైపర్ ఆది తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు. జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న హైపర్ ఆది పలు బుల్లితెర కార్యక్రమాలలో నటిస్తూ పెద్ద ఎత్తున సందడి చేస్తున్నారు. ఇక ఈయన జబర్దస్త్ కార్యక్రమంలో పలువురు హీరోలు నటించిన సినిమాలలో కొన్ని సన్నివేశాలను తనదైన స్టైల్ లో కామెడీ చేస్తూ జబర్దస్త్ కార్యక్రమం పై ప్రేక్షకులను సందడి చేస్తూ ఉంటారు. గత కొంతకాలం నుంచి జబర్దస్త్ కార్యక్రమానికి దూరంగా ఉన్నటువంటి హైపర్ ఆది తిరిగి ఈ కార్యక్రమంలో సందడి చేస్తున్నారు.

ఇదిలా ఉండగా తాజాగా ఈయన దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన RRR సినిమా పై తనదైన స్టైల్ లో సెటైర్లు వేశారు. ఇలా ఈ సినిమాపై ఆది సెటైర్లు వేయడంతో పెద్ద ఎత్తున రాజమౌళి ఫ్యాన్స్ ఆది పై మండిపడుతున్నారు. జబర్దస్త్ కార్యక్రమంలో భాగంగా హైపర్ ఆది ఈ సినిమా గురించి మాట్లాడుతూ.. ఈ సినిమాలో మల్లీ పాత్రను పట్టుకొని ఆమె కొమ్మ ఉయ్యాల..

కోన జంపాల అనే పాట పాడకుండా ఉండి ఉంటే ఇంత జరిగేది కాదు కదా అంటూ ఈ సినిమాపై సెటైర్స్ వేశారు. అయితే ఈ సినిమా మొత్తం ఈ పాట ప్రారంభం అయితేనే అసలు కథ ప్రారంభమవుతుంది. ఇలా ఆది ఈ పాటపై సెటర్లు వేయడంతో సినిమాపై కూడా సెటైర్స్ వేశారని పలువురు భావిస్తున్నారు. ఇలా హైపర్ ఆది ఈ సినిమా గురించి సెటైర్స్ వేయడంతో ఒకవైపు రాజమౌళి అభిమానులు మాత్రమే కాకుండా, ఎన్టీఆర్ రామ్ చరణ్ అభిమానులు సైతం మండిపడుతున్నారు.

రాజమౌళి వంటి దర్శకుడిని విమర్శించే స్థాయికి ఎదిగావా నువ్వు అంటూ చాలామంది మండిపడుతున్నారు.అయితే ఈ విషయంపై ఈయన ఎలా రియాక్ట్ అవుతారో తెలియదు కానీ ప్రస్తుతం అభిమానులు మాత్రం హైపర్ ఆది వ్యవహార శైలిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే హైపర్ ఆది ఇప్పటివరకు ఇలాంటి ఎన్నో వివాదాలు ఎదుర్కొన్న సంగతి మనకు తెలిసిందే.

ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

శాకిని డాకిని సినిమా రివ్యూ & రేటింగ్!
నేను మీకు బాగా కావాల్సినవాడిని సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ గీతు రాయల్ గురించి ఆసక్తికర విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus