మెసేజ్ ఇవ్వాలని ఎప్పటినుండో ఉంది – రామ్

రామ్ కెరీర్ మొదలై పదేళ్ళయింది. కానీ ‘దేవదాస్’ సినిమాలో ఎలా ఉన్నాడో రేపు విడుదల కానున్న ‘హైపర్’లోను అలానే ఉన్నాడు ఈ ఎనర్జిటిక్ స్టార్. పూర్తిగా మీసం మొలవక ముందే పంతొమ్మిదేళ్ళ వయసులో సిల్వర్ స్క్రీన్ పైకి ఎంట్రీ ఇచ్చిన రామ్ తాను చేసిన పాత్రలన్నీ తనలానే హుషారుగా ఉండేలా చూసుకుంటూ ఉంటాడు. ఈ ఏడాదిలో తెరమీదికొచ్చిన ‘నేను శైలజ’ మోతాదు కాస్త తగ్గినా సినిమా ప్రేక్షకులకి నచ్చింది. అయితే సందేశంతో కూడిన సినిమాలు కూడా చేయాలని ఎప్పటినుండో అనుకుంటున్న రామ్ ‘హైపర్’తో ఆ కోరిక కొంతవరకు తీరిందని చెబుతున్నాడు.

కందిరీగ తర్వాత సంతోష్ శ్రీనివాస్-రామ్ కలయికలో వస్తున్న ‘హైపర్’లో తండ్రి కొడుకుల మధ్య అనుబంధం ఉంటుందని ముందు నుండి చిత్ర బృందం చెబుతూ వస్తుంది. అయితే ఇందులో అంతర్లీనంగా ఓ సందేశం కూడా ఉందట. ఈ తరహా సందేశాత్మక సినిమాలు చేయాలనున్నా తన వయసు సరిపోక చేయలేదన్న రామ్ ఈ సినిమా ద్వారా ఆ లోటు తీరిందన్నాడు. అయితే ఆ సందేశం ఏంటన్నది తెరపైనే చూడాలని ట్విస్ట్ ఇచ్చాడు. ముప్ప్లైల్లోకి ఎంటరవుతున్నారు కదా ప్రేమ, పెళ్లి మాటేంటి అన్న ప్రశ్నకు ప్రేమ కథల్లో నటిస్తున్నానే గానీ నాకంటూ ఏ ప్రేమ కథ లేదని చెప్పుకొచ్చాడు. తర్వాతి సినిమాపై స్పందిస్తూ కిషోర్ తిరుమలతో ఉంటుందని బదులిచ్చాడు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus