రాజ్ తరుణ్ తో సౌకర్యంగా ఉంది : అమైరా దస్తూర్

యంగ్ హీరో రాజ్ తరుణ్ తో కలిసి నటించడం చాలా కంఫటబుల్ గా ఉందని బాలీవుడ్ నటి అమైరా దస్తూరి చెప్పింది. ఈ భామ హ్యాట్రిక్ హీరో చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయం కాబోతోంది. కొత్త దర్శకురాలు సంజన రెడ్డి  ఏకే ఎంటర్ టైన్ మెంట్స్ పతాకం పై తెరకెక్కిస్తున్న రాజుగాడు (యమ డేంజర్) చిత్రంలో  రాజ్ తరుణ్ తో కలిసి అమైరా రొమాన్స్ చేయనుంది.

ఈ సినిమాకు  స్టోరీ, స్క్రీన్ ప్లే, ప్రముఖ దర్శకుడు మారుతి అందిస్తున్నారు. హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రంలో భాగం కావడం పై ముంబై సుందరి  స్పందించింది. “తెలుగు సినిమా అంటే భాషతో ఏమైనా సమస్య వస్తుందేమో అనుకున్నాను. కానీ నా కో స్టార్ రాజ్ తరుణ్ నాకు బాగా సహకరిస్తున్నారు. నాలో భయాన్ని పోగొట్టారు. షూటింగ్ ని ఎంజాయ్ చేస్తున్నాను” అని ఓ ఇంటర్వ్యూ లో అమైరా చెప్పింది. ప్రస్తుతం ఈమె “కుంగ్ ఫు యోగా” అనే హిందీ సినిమాలో నటిస్తోంది. మారుతి కథ, సంజన డైరక్షన్, రాజ్ తరుణ్, అమైరా, రాజేంద్రప్రసాద్ ఈ సినిమాకు ప్రధాన బలాలని ఏకే ఎంటర్ టైన్ మెంట్స్ అధినేత అనిల్ సుంకర తెలిపారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus