హీరోయిన్లన్నాక హీరోలతో ఎఫైర్లు చాలా కామన్. నచ్చితే పెళ్లి వరకూ వెళ్ళే సదరు రిలేషన్ షిప్.. సెట్ అవ్వలేదని ఇద్దరిలో ఏ ఒక్కరికీ అనిపించినా వెంటనే బ్రేక్ అయిపోతుంది. ప్రేమించే విషయంలో హీరోయిన్ల ఇన్వాల్వ్ మెంట్ ఎంత ఉంటుందో తెలియదు కానీ.. బ్రేకప్ లో మాత్రం 90 శాతం హీరోదే తప్పు బాధ్యత ఉంటుంది. ఈ కోవకు చెందిన బ్రేకప్పులు ఎక్కువగా బాలీవుడ్ లో కనిపిస్తుంటాయి. అయితే.. ఈ బ్రేకప్, ప్యాచప్ ల గురించి హీరోహీరోయిన్స్ పబ్లిక్ లో స్టేట్ మెంట్ ఇవ్వడానికి మాత్రం ఇష్టపడరు.
కానీ.. హాటెస్ట్ హీరోయిన్ ఆఫ్ బాలీవుడ్ అయిన కత్రినా కైఫ్ మాత్రం రణబీర్ కపూర్ తో తన బ్రేకప్ గురించి బాహాటంగా మాట్లాడడమే కాకుండా, రణబీర్ తో బ్రేకప్ అయ్యాక తాను సంతోషంగా ఉన్నానని, కెరీర్ మీద కాన్సన్ ట్రేట్ చేయగలుగుతున్నాని, రణబీర్ తో రిలేషన్ లో ఉన్నప్పుడు నాకు నేను సమయం కేటాయించుకోవడానికి కుదిరేది కాదు. నిజం చెప్పాలంటే.. రణబీర్ తో బ్రేకప్ అయ్యాకే నా కెరీర్ గాడిలో పడింది అని చెప్పుకొచ్చింది కత్రినా కైఫ్.
రణబీర్ తో బ్రేకప్ అనంతరం మళ్ళీ తన పాత ప్రియుడు సల్మాన్ చెంతకి కత్రినా వెళ్లిపోగా.. దీపిక, కత్రినాలతో బ్రేకప్ అనంతరం రణబీర్ మాత్రం ఆలియా భట్ తో డేటింగ్ మొదలెట్టాడు.