Samantha: హాట్ టాపిక్ గా మారిన సమంత లేటెస్ట్ పోస్ట్..!

సమంత… గత రెండు నెలల నుండీ ఈమె వార్తల్లో నిలుస్తూనే ఉంది.అలా అని ఎక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేది కాదు. చెయ్ తో విడాకుల తర్వాత మెల్ల మెల్లగా మళ్ళీ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ వస్తోంది.ఎప్పటికప్పుడు తన పర్సనల్ విషయాల గురించి పరోక్షంగా ఏవేవో పోస్ట్ లు పెడుతూ వస్తోంది. ఇటీవల తన స్నేహితులతో కలిసి విదేశాల్లో ఎంజాయ్ చేస్తున్న ఫోటోలు వంటి షేర్ చేస్తూ తానూ ఎంత హ్యాపీగా ఉందో చెప్పకనే చెబుతుంది.

ఇదిలా ఉండగా.. చైతన్యతో విడాకులు తర్వాత సమంత పై కొంత నెగిటివిటీ ఏర్పడిందనేది వాస్తవం. దానిని అధిగమించడానికి కూడా తనవంతు ప్రయత్నాలు చేస్తుంది సామ్. తాజాగా సామ్ పెట్టిన లేటెస్ట్ పోస్ట్ ను బట్టి.. ఈ విషయం క్లియర్ గా తెలుస్తుంది. మై మామ్స్ సెడ్ అనే హ్యాష్‏ట్యాగ్‏తో పలు ఆసక్తికరమైన పోస్టులు పెడుతూ వస్తోంది సమంత.అయితే తాజాగా … ” నేను చాలా స్ట్రాంగ్.. నేను కఠినమైన పరిస్థితుల నుండీ సులువుగా బయటపడతాను.

నేను పర్ఫెక్ట్ కాదు.. కానీ నాకు నేను ఫర్ఫెక్టే… నేను ఎప్పటికీ వెనకడుగు వేయను.. నేను ప్రేమ, దయ కలదాన్ని… నేను దృడ నిశ్చయం కలిగినదాన్ని.. నేను మనిషిని… నేను యోధురాలిని.. అంటూ అమ్మ చెప్పింది ” అంటూ ఆ పోస్ట్ లో పేర్కొంది. ప్రస్తుతం ఆ పోస్ట్ వైరల్ గా మారింది.

వరుడు కావలెను సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

రొమాంటిక్ సినిమా రివ్యూ & రేటింగ్!
పునీత్ రాజ్ కుమార్ సినీ ప్రయాణం గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
ఇప్పటివరకు ఎవ్వరూ చూడని పునీత్ రాజ్ కుమార్ ఫోటోలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus