అక్షయ్ కుమార్ విలన్ కాదట!

సినిమాలో కథానాయకుడి పాత్ర పండాలంటే.. ప్రతినాయకుడి పాత్ర అంతకు మించి అనే స్థాయిలో కుదిరితే కథానాయకుడ్ని తలదన్నే స్థాయిలో ఉండాలి. అప్పుడే హీరో క్యారెక్టర్ బాగా ఎలివేట్ అవుతుంది. అందుకే ఈమధ్య తెలుగులోనే కాదు తమిళం. మలయాళ చిత్రాల్లోనూ విలన్ పాత్రను ప్రాధాన్యత పెరిగింది. “ధృవ” సినిమా మొత్తం విలన్ పాయింట్ ఆఫ్ వ్యూలో సాగుతుంది, రీసెంట్ గా వచ్చిన తమిళ చిత్రం “విక్రమ్ వేదా”లో విలన్ షేడ్ ఉన్న నెగిటివ్ రోల్ లో విజయ్ సేతుపతి ఎంత అద్భుతంగా నటించాడు అనేది ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఆ ట్రెండ్ ను ఫాలో అవుతూ శంకర్ కూడా తాను తెరకెక్కిస్తున్న తాజా చిత్రం “2.0”లో విలన్ గా బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ ను ఎంపిక చేసుకొన్నాడు.

షూటింగ్ మొదలై.. ఆడియో విడుదలై.. ఫస్ట్ లుక్స్ కూడా రిలీజయ్యాక చాలా సైలెంట్ గా అక్షయ్ కుమార్ బాలీవుడ్ మీడియా వద్ద పెద్ద బాంబ్ పేల్చాడు. రజనీకాంత్ హీరోగా నటిస్తున్న “2.0” సినిమాలో నేను విలన్ రోల్ ప్లే చేయట్లేదు, నాది కూడా దాదాపుగా హీరో లాంటి క్యారెక్టరే అని చెప్పాడట. దాంతో ఇప్పటివరకూ అక్షయ్ కుమార్ “2.0”లో విలన్ అని మెంటల్ గా ఫిక్స్ అయిపోయిన ఆడియన్స్ అందరూ వారి ఒపీనియన్స్ ను ఎలా మార్చుకోవాలో అనే సందిగ్ధంలో ఉన్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus