ఐశ్వర్య రాయ్ ని గుర్తుపట్టని డైరక్టర్..!!

విభిన్న కథలను ఎంచుకుంటూ.. వినూత్నంగా ప్రచారం చేస్తూ టాలీవుడ్ లో డిఫరెంట్ డైరెక్టర్ గా రవిబాబు పేరుతెచ్చుకున్నారు. ఎంబీఏ చదివి సినిమాల బాట పట్టిన ఈ దర్శకుడు అల్లరి, నచ్చావులే, నువ్విలా, అవును వంటి హిట్లు అందుకున్నారు. రవిబాబు కెరీర్ తొలి నాళ్లలో ప్రముఖ యాడ్ ఫిల్మ్ మేకర్ రాజీవ్ మీనన్ దగ్గర కొంతకాలం పనిచేశారు. ఆ సమయంలో ఐశ్వర్య రాయ్ ని అతను గుర్తుపట్టలేక పోయారట.

రీసెంట్ గా రవిబాబు ఇచ్చిన ఇంటర్వ్యూ లో ఈ విషయం వెల్లడించారు. “నేను గురువు రాజీవ్ మీనన్ వద్ద పని చేస్తున్నప్పుడు ఆయన టైటాన్ వాచ్ కోసం ఒక యాడ్ షూట్ చేసి యోచనలో ఉన్నారు. అందులో నటించేందుకు మోడల్ ఐశ్వర్య రాయ్ ని తీసుకు రమ్మని నన్ను ఎయిర్ పోర్ట్ కి వెళ్లమన్నారు. కారులో వెళ్లాను. అక్కడ ఒక అమ్మాయి కనిపించింది. ఆమెను “మీరు ఐశ్వర్య రాయా?” అని అడిగాను.

కాదని పక్కనే ఉన్న ఐశ్వర్య రాయ్ ని చూపించింది. నేను అడిగిన ఆమె మోడల్ కో ఆర్డినేటర్ కవిత ఠాకూర్.” అని ఆ సంగతులు గుర్తు చేసుకున్నారు. “అప్పుడే ఐశ్వర్య రాయ్ మోడలింగ్ రంగంలో ప్రవేశించింది. పెద్దగా ప్రపంచానికి తెలియదు. తర్వాత ఏడాది ప్రపంచ సుందరిగా కిరీటం దక్కించుకుంది. అందుకే ఆమెను గుర్తుపట్టలేక పోయాను” అని రవి బాబు చెప్పారు. ప్రస్తుతం రవిబాబు పంది పిల్లను నటింపజేసే పనిలో బిజీగా ఉన్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus