వివాదం గురించి తనకేమీ తెలియదన్న ప్రియా వారియర్

మలయాళం మూవీ ‘ఒరు అధార్ లవ్’ ఇప్పుడు జాతీయ వార్త అయింది. ఇందులో హీరోయిన్ గా నటించిన ప్రియా ప్రకాష్ వారియర్ కన్ను గొట్టి.. యువకుల హృదయాలను కొల్లగొట్టింది. కళ్ళతో ఆమె పలికించిన భావాలు భాషా భేదం లేకుండా.. అందరిని ఆకట్టుకుంది. ఆమె ఇంటర్వ్యూ కోసం ప్రముఖ టీవీ చానళ్ళు ఎగబడ్డాయి. చివరికి ప్రియా వారియర్ ని అభిమానుల ముందు ఉంచాయి. ఆమె నుంచి అనేక ప్రశ్నలకు సమాధానాలు రాబట్టాయి. ఇంత కట్టుకున్న సీన్ కోసం ఎలా ప్రాక్టీస్ చేసారు? అని అడగగా.. ‘‘హీరోను చూసి చిరునవ్వు నవ్వుతూ కన్ను గీటే సీన్ ను డైరెక్ట్ గానే చేశాను. ప్రాక్టీస్ లేదు.

అది ఇంత వైరల్ అవుతుందని కూడా అనుకోలేదు. అసలే మాత్రం ఊహించని ఈ పాపులారిటీ చూసి ఎలా స్పందించాలో కూడా తెలియడం లేదు’’అంటూ ప్రియ ప్రకాష్ వారియర్ చెప్పింది. మరి ముస్లింల మనోభావాలు దెబ్బతీసేలా ఈ పాట ఉందంటూ ఫిర్యాదులు వస్తున్నాయి కదా దానిపై ఏమంటారు? అని ప్రశ్నించగా. “ఆ విషయం గురించి నాకేమీ తెలియదు. దీనిపై ఏమీ మాట్లాడకుండా ఉండిపోవడమే మేలు” అని వెల్లడించింది. ఈ చిత్ర డైరక్టర్ ఒమర్ లులు మాత్రం పాటలో ముస్లిముల మనోభావాలు దెబ్బతినే పదాలు ఏమీ లేదని మీడియాకి స్పష్టం చేశారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus