డబ్బులు కాదు…నాకు గుర్తింపు కావాలి…

  • January 27, 2017 / 06:47 AM IST

సినిమాల్లో అవకాశాల కోసం, లేకపోతే కాంట్రొవర్సీ సృస్టించి కాస్తో…కూస్తో డబ్బులు లాగేసెందుకు చాలా మంది ప్రయత్నాలు చేస్తూ ఉంటారు…అయితే నాకు డబ్బు అవసరం లేదు…క్రెడిట్స్ కావాలి అంటున్నాడు ఒక రచయిత…విషయం ఏమిటంటే…‘శ్రీమంతుడు’ కథ నాదంటూ శరత్ చంద్ర అనే రచయిత న్యాయస్థానం వేదికగా పోరాటం చేస్తున్నాడు…అయితే అదే క్రమంలో ఈ మ్యాటర్ జరిగి దాదాపుగా ఏడాది అయ్యింది…ఇదే విషయమై…మహేష్ బాబు.. కొరటాల శివలతో పాటు నిర్మాతలకు కోర్టు నోటీసులు అందిన విషయం మనకు తెలిసిందే…అయితే అదే క్రమంలో అసలు ఈ సినిమా, తన రచన ఎలా ఒక్కటే అవుతాయి అని తన మాటల్లోనే విందాం… నేను నవలలో దేవరకొండ అని రాస్తే శ్రీమంతుడు సినిమాలో దేవరకోట అని పెట్టారు. అలాగే నా నవలలో తండ్రితో ఘర్షణ తర్వాత కథానాయకుడు గ్రామానికి వెళ్తాడు. సినిమాలో హీరోయిన్ తో ఘర్షణ తర్వాత హీరో గ్రామానికి వెళ్లినట్లు చూపించారు. హీరో హీరోయిన్ ఒకే కాలేజీలో చదవుకోవడం కూడా నా నవల నుంచి తీసుకుందే.

ఇలా పాయంట్ తో పాయంట్ ఈ సినిమా కధ తనదే అంటూ చెబుతున్నాడు రచయిత….అదే క్రమంలో తన కధ కోసం ఫైట్ చేసే తరుణంలో రచయితల సంఘంలో ఫిర్యాదు చేశాడట. వాళ్లు తనని కోర్టుకు వెళ్లమన్నారు అని తెలిపాడు. ఇక కొరటాల శివకు దీని గురించి చెబితే.. తన సినిమా.. నవల వేర్వేరు అని సమాధానం వచ్చింది అంటున్నాడు. రచయితల సంఘానికి వెళ్లినపుడు బేరసారాలు జరిగాయి. రూ.15 లక్షలు ఇస్తామన్నారు అని చెబుతున్నాడు. ఐతే నాకు డబ్బు వద్దు. ‘శ్రీమంతుడు’ చిత్రాన్ని హిందీలో హృతిక్ రోషన్ తో తీస్తున్నారు కాబట్టి క్రెడిట్స్ ఇవ్వండి అని తెలిపాడని సమాచారం.. ఏది ఎంతవరకూ నిజమో తెలీదు కానీ…మొత్తానికి ఈ విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు…చూద్దాం మరి ఎం జరుగుతుందో.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus