నాన్నకు ప్రేమతో, సరైనోడు, ధృవ వంటి విజయాలను అందుకొని టాలీవుడ్ టాప్ హీరోయిన్ గా నిలదొక్కుకున్న సమయంలో రకుల్ ప్రీత్ సింగ్ సాహసంతో కూడిన నిర్ణయం తీసుకుంది. అదేంటంటే.. కథ వినకుండా సినిమాకి సైన్ చేయడం. సినిమా రంగంలో వచ్చిన పేరుని నిలుపుకోవడం అత్యంత కష్టం. అందుకోసం చాలా జాగ్రత్తగా అడుగులు వేయాలి. ముఖ్యంగా స్టోరీ సెలక్షన్ లో శ్రద్ధ పెట్టాలి. బాగా లేని కథలో ఎంత బాగా నటించినా ఫలితం ఉండదు. ఒక అపజయాన్ని తమ ఖాతాలో వేసుకోవడం తప్ప. ఇప్పుడు అలా ప్లాప్ ని చూసి బాధపడుతోంది. ఆ సినిమానే స్పైడర్. రకుల్‌కు ఎప్పటి నుంచో మహేష్ బాబు సినిమాలో చేయాలనే కోరిక ఉంది. ‘బ్రహ్మోత్సవం’ సినిమాలో చేసే ఛాన్స్ వచ్చినట్టు వచ్చి చేజారిపోయింది. దర్శకుడు మురుగదాస్ అంటే కూడా ఆమెకు చాలా అభిమానం. అలాంటింది ఇద్దరి కాంబినేషన్లో వస్తున్న మూవీ కావడంతో మురుగదాస్ అడిగిన వెంటనే ‘నేను ఆ సినిమా చేస్తున్నాను’ అని అనేసింది.
ఆ విషయాన్నీ మీడియా ముఖంగా చెప్పింది. ఏకకాలంలో తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కిన ఈ మూవీ తనకి ప్లస్ అవుతుందంటే ఉన్న పేరుని పోగొట్టింది. దీంతో ఆ సినిమా పేరు తన వద్దకు తీసుకు రావద్దని మండి పడుతోంది. ఓ ఇంటర్వ్యూ లో రకుల్ మాట్లాడుతూ… ”స్పైడర్ గురించి మాట్లాడాలనుకోవడం లేదు. సినిమా ఆశించిన రీతిలో ఆడలేదనే అసహనంతో మాత్రం కాదు. అందులో నటించడం ఓ మంచి అనుభవం. దర్శకుడు మురుగదాస్‌తో పని చేసే అవకాశం రావడం అదృష్టంగా భావించి ఆ సినిమా చేశా. అవకాశం వస్తే మళ్లీ ఆయనతో చేస్తా. అంతకు మించి ఆ సినిమా గురించి ఏం మాట్లాడలేను.” అని సారీ చెప్పింది. ఈ మాటలు బట్టి అర్ధం చేసుకోవచ్చు.. స్పైడర్ మూవీ తనని ఎంతగా బాధ పెట్టిందో. ఈ గుణపాఠంతో ఇక నుంచి స్టోరీ విని సైన్ చేస్తుంది.