ముద్దులకు నేనెప్పుడూ ముందుంటా

సినిమాల్లో చాలా ప‌ద్ధ‌తైన‌, సాంప్ర‌దాయ పాత్ర‌ల్లో క‌న‌బ‌డే అమ‌లాపాల్ బ‌య‌ట మాత్రం చాలా బోల్డ్‌గా ఉంటుంది. త‌న‌కు న‌చ్చిన విధంగా ప్ర‌వ‌ర్తిస్తూ, మాట్లాడుతూ వివాదాలు సృష్టిస్తుంటుంది. కొన్నిసార్లు హ‌ద్దులు దాటి హాట్ కామెంట్లు కూడా చేస్తుంటుంది. కొన్ని రోజుల క్రితం త‌న న‌డుముపై అమ‌ల చేసిన కామెంట్స్ హాట్ టాపిక్‌గా మారిన విష‌యం తెలిసిందే.

తాజాగా సినిమాల్లో లిప్‌లాక్ స‌న్నివేశాల గురించి అమ‌ల త‌నదైన శైలిలో స్పందించింది. ఆ సీన్‌ల‌ను పండించ‌డానికి తానేం చేస్తుందో కూడా బోల్డ్‌గా చెప్పింది. `సినిమాల్లో లిప్‌కిస్ సీన్ల‌ను పండించ‌డానికి నా వంతుగా ప్ర‌య‌త్నం చేస్తాను. అలాంటి సీన్ల‌లో న‌టించ‌డానికి నాకేం ఇబ్బంది లేదు. అయితే లిప్‌లాక్ స‌న్నివేశాల చిత్రీక‌ర‌ణ స‌మ‌యంలో లిప్‌స్టిక్ వాడ‌డం మాత్రం అస్స‌లు ఇష్టం ఉండ‌దు. పెద‌వి ముద్దుల స‌మ‌యంలో లిప్‌స్టిక్ బాగోదు. నేనైతే అలాంటి స‌న్నివేశాలు చిత్రీక‌రిస్తున్న‌పుడు లిప్‌స్టిక్ వాడ‌ను. లిప్‌స్టిక్ లేక‌పోతే సీన్ బాగా పండుతుంది` అని ఓ మేగ‌జీన్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో అమ‌ల చెప్పింది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus