‘నువ్వు నాకు నచ్చావు..’ ఎన్ని సార్లు చూశానో గుర్తులేదు – శ్రీవిష్ణు

పక్కింటి కుర్రోడిలా కనిపించే శ్రీవిష్ణు హీరోగా వరుసగా విజయాలు అందుకుంటున్నారు. అప్పట్లో ఒకడుండేవాడు సినిమాతో ఎంట్రీ ఇచ్చి.. తొలి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న శ్రీవిష్ణు “మెంటల్ మదిలో” చిత్రంతో యువతకు అభిమాన హీరో అయ్యారు. అతను తాజాగా చేసిన చిత్రం “నీది నాది ఒకే కథ”. వేణు ఊడుగుల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో సట్నా టిటూస్ హీరోయిన్‌గా నటించింది. బిచ్చగాడు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ఈ బ్యూటీ ఈ సినిమాలోనూ మంచి రోల్ చేసింది. రీసెంట్ గా విడుదలయిన టీజర్‌ కి మంచి స్పందన వచ్చింది. ఈ సినిమా టీజర్‌ 24 గంటల్లోనే 5 లక్షలకుపైగా డిజిటల్‌ వ్యూస్‌ సాధించింది. శ్రీవిష్ణు మరోసారి హిట్ అందుకోబోతున్నట్లు సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. శ్రీవిష్ణు ఈ చిత్ర ప్రమోషన్‌లో బిజీగా ఉన్నారు.

ఇందులో భాగంగా శ్రీవిష్ణు మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర విషయాలు చెప్పారు. ‘‘నేను హీరో వెంకటేష్‌గారికి అభిమానిని. ఆయన నటించిన నువ్వు నాకు నచ్చావ్ చిత్రాన్ని ఎన్ని సార్లు చూశానో కూడా గుర్తులేదు. ఆయన సినిమాలంటే అంత ఇష్టం. అలా నేను అభిమానించే వెంకటేష్‌గారు నటించిన సినిమా ఆడిన థియేటర్‌లో నా చిత్రం మెంటల్ మదిలో ఆడటం చాలా సంతోషాన్ని కలిగించింది..’’ అంటూ తన ఆనందాన్ని పంచుకున్నారు. “నీది నాది ఒకే కథ” కూడా మంచి విజయాన్ని అందిస్తుందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఆరన్‌ మీడియా వర్స్క్‌ పతాకంపై ప్రశాంతి, కృష్ణ విజయ్‌ నిర్మించిన ఈ మూవీ త్వరలో రిలీజ్ కానుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus