మామూలుగా కళ్యాణమొచ్చినా కక్కోచ్చినా ఆగదంటారు. కానీ కరీనా మాత్రం కడుపోచ్చినా ఆగడం లేదు. 7వ నెల ప్రెగ్నెంట్ గా ఉంటూనే పార్టీలు, హాలీడే ట్రిప్పులు అంటూ తెగ తిరిగేస్తున్న ఖాన్ లేడీ.. ప్రసవం అనంతరం కూడా ఇదే దూకుడుతో ముందుకెళ్లాలనుకోంటోంది. సాధారణంగా బాలింతరాలంటే కనీసం రెండు నెలల బెడ్ రెస్ట్ అవసరం.
కేవలం నెల రోజుల గ్యాప్ తీసుకొని సినిమాల్లో నటించడానికి సై అనేస్తోంది సైజ్ జీరో బ్యూటీ. ఇది ఎంతవరకూ శ్రేయస్కరం అనేది అమ్మడిని ట్రీట్ చేస్తున్న డాక్టర్లకే తెలియాలి. ఇకపోతే.. తమ బిడ్డ చాలా క్షేమంగా ఉందని, పెట్టుబోయే యువరాణికి “సఫీనా” అనే పేరును సైతం ఖరారు చేసినట్లు కరీనా చెబుతోంది.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.