తమిళ స్టార్ హీరో ధనుష్ (Dhanush) ప్రధాన పాత్రలో నటించి, దర్శకత్వం వహించిన సినిమా ‘ఇడ్లీ కొట్టు’. ‘పా పాండి’, ‘రాయన్’ ‘జాబిలమ్మ నీకు అంత కోపమా’ వంటి హిట్ల తర్వాత ధనుష్ డైరెక్ట్ చేసిన సినిమా ఇది. దసరా కానుకగా అక్టోబర్ 1న రిలీజ్ అయ్యింది. గ్రామీణ నేపథ్యంలో సాగే లవ్ అండ్ ఎమోషనల్ ఎంటర్టైనర్ ఇది. మొదటి రోజు సినిమాకి తమిళంలోనే కాకుండా తెలుగులో కూడా నెగిటివ్ టాక్ వచ్చింది.
దీంతో ఓపెనింగ్స్ చాలా బ్యాడ్ గా రిజిస్టర్ అయ్యాయి. అయితే 2వ రోజు నుండి కొంచెం బెటర్ అయ్యింది. ‘ఓజి’ ‘కాంతార చాప్టర్ 1’ సినిమాలు పోటీగా ఉండటం వల్ల సఫర్ అవుతున్నప్పటికీ.. ఉన్నంతలో ఓకే అనిపిస్తుంది. 3వ రోజు, 4వ రోజు పర్వాలేదు అనిపించాయి. ఒకసారి 4 డేస్ కలెక్షన్స్ ను గమనిస్తే :
నైజాం | 0.24 cr |
సీడెడ్ | 0.13 cr |
ఉత్తరాంధ్ర | 0.17 cr |
ఈస్ట్ | 0.54 cr(షేర్) |
‘ఇడ్లీ కొట్టు’ (Idli Kottu) చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో రూ.2 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.2.2 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. 4 రోజుల్లో ఈ సినిమా రూ.0.54 కోట్ల షేర్ ను రాబట్టింది. గ్రాస్ పరంగా రూ.0.96 కోట్లు కలెక్ట్ చేసింది. బ్రేక్ ఈవెన్ కోసం మరో రూ.1.66 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. ప్రెజెంట్ ట్రెండ్ ను బట్టి చూస్తే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వడం కష్టమే కానీ ఉన్నంతలో కొన్ని మెరుపులు అయితే మెరిపిస్తుంది అని చెప్పాలి.