Jr NTR: యంగ్ జనరేషన్ స్టార్స్ లో ఆ రికార్డ్ తారక్ కు సొంతమవుతుందా?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న దేవర సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతుండగా ఈ సినిమా హిట్టైతే ఎన్టీఆర్ వరుసగా ఏడు హిట్లను సొంతం చేసుకున్న హీరోగా గుర్తింపును సంపాదించుకోనున్నారు. యంగ్ జనరేషన్ హీరోలలో తారక్ ఈ అరుదైన రికార్డ్ ను సొంతం చేసుకుంటారేమో చూడాలి. దేవర మూవీ ఊరమాస్ కథాంశంతో తెరకెక్కుతుండటం గమనార్హం. కొరటాల శివ తారక్ ను ఊరమాస్ రోల్ లో చూపించనున్న నేపథ్యంలో ప్రశాంత్ నీల్ తారక్ ను ఏ విధంగా చూపిస్తారనే చర్చ సైతం జరుగుతుండటం గమనార్హం.

యంగ్ జనరేషన్ స్టార్ హీరోలలో తారక్ ఖాతాలో ఇప్పటికే ఎన్నో అరుదైన రికార్డులు ఉండగా మరో రికార్డ్ చేరితే మాత్రం ఫ్యాన్స్ సంతోషానికి అవధులు ఉండవని చెప్పవచ్చు. దేవర హిట్ కావాలని అభిమానులు మనస్పూర్తిగా కోరుకుంటున్నారు. కొరటాల శివ ప్రతి సీన్ ను జాగ్రత్తగా తెరకెక్కిస్తున్నారని దేవర సినిమాలో యాక్షన్ సీన్స్ స్పెషల్ గా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారని తెలుస్తోంది. దేవర ఓటీటీ హక్కులు 120 కోట్ల రూపాయలు అమ్ముడయ్యాయని సమాచారం అందుతోంది.

ఆర్.ఆర్.ఆర్ తర్వాత సినిమా కావడంతో ఫ్యాన్స్ ఈ సినిమాపై భారీస్థాయిలో ఆశలు పెట్టుకున్నారు. దేవర సినిమా కచ్చితంగా మెప్పిస్తానని తారక్ కాన్ఫిడెన్స్ తో ఉన్నారు. దేవర సినిమా కూడా రెండు భాగాలుగా తెరకెక్కనుందని ప్రచారం జరుగుతుండగా ఈ ప్రచారంలో నిజానిజాలు తెలియాల్సి ఉంది. దేవర సినిమా సమ్మర్ కానుకగా పండుగలు ఉన్న సమయంలో రిలీజ్ కానుండటం దేవరకు కలిసొస్తోంది.

జాన్వీ కపూర్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుండగా తెలుగులో ఈ సినిమా రికార్డులు క్రియేట్ చేస్తుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. 250 కోట్ల రూపాయల బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతుండటం గమనార్హం. దేవర సినిమా భవిష్యత్తులో సైతం సంచలనాలు సృష్టించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

స్కంద సినిమా రివ్యూ & రేటింగ్!

చంద్రముఖి 2 సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రిన్స్ యవార్ గురించి 10 ఆసక్తికర విషయాలు !

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus