Saaho: సాహో మూవీ ఇప్పుడు విడుదలై ఉంటే సంచలనాలు సృష్టించేదా?

టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన ప్రభాస్ సుజిత్ డైరెక్షన్ లో సాహో సినిమాలో నటించగా ఈ సినిమా నాలుగేళ్ల క్రితం ఇదే రోజున థియేటర్లలో విడుదలై బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని అందుకోలేదు. ఈ సినిమా బాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచినా తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఆశించిన ఫలితాన్ని అందుకోలేదు. అయితే ఇప్పుడు విడుదలై ఉంటే ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచేదని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

ఈ సినిమా అప్పట్లో అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కగా ప్రభాస్ క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ వల్ల పెద్దగా నష్టాలు రాలేదు. సుజీత్ మరికొన్ని జాగ్రత్తలు తీసుకుని ఉంటే ఈ సినిమా రేంజ్ మరింత పెరిగేది. ప్రభాస్ అభిమానులలో చాలామందికి నచ్చిన సినిమాలలో ఈ సినిమా కూడా ఒకటి కావడం గమనార్హం. సుజీత్ ప్రస్తుతం ఓజీ సినిమాతో బిజీగా ఉన్నారు. మరో రెండు రోజుల్లో ఓజీ సినిమా గ్లింప్స్ రిలీజ్ కానుంది.

ఓజీ గ్లింప్స్ సినిమాపై అంచనాలను పెంచడం గ్యారంటీ అని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఓజీ మూవీ 100 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తం బడ్జెట్ తో తెరకెక్కుతోంది. ఓజీ సినిమాలో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయని అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఈ సినిమా ఉండనుందని తెలుస్తోంది. వచ్చే ఏడాది ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ కానుందని సమాచారం అందుతోంది.

ఓజీ సినిమా రిలీజ్ డేట్ కు సంబంధించిన క్లారిటీ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఓజీ సినిమాకు డీవీవీ దానయ్య నిర్మాత కాగా పవన్ పాత్ర కొత్తగా ఉండనుందని తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఈ సినిమాపై చాలా ఆశలు పెట్టుకోగా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి. సుజీత్ ఈ సినిమాతో (Saaho) కెరీర్ బిగ్గెస్ట్ హిట్ అందుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

https://www.youtube.com/watch?v=d_qU7Fk3-L0

మిడ్ రేంజ్ హీరోలు చేసిన ఈ 10 యాక్షన్ సినిమాలు భారీ నష్టాలు మిగిల్చాయని మీకు తెలుసా?

మెహర్ రమేష్ తో పాటు పెద్ద హీరోలు ఛాన్సులు ఇచ్చినా హిట్లివ్వలేకపోయిన డైరెక్టర్ల లిస్ట్.!
రామ్ నీ బాలయ్య ఏమని తిట్టాడో తెలిస్తే షాక్ అవుతారు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus