రానా దగ్గుబాటి చేతులు మీదుగా ‘బ్యాడ్ గాళ్స్’ చిత్రం నుండి ‘ఇలా చూసుకుంటానే’ సాంగ్ విడుదల

‘నీలి నీలి ఆకాశం’ అనే చార్ట్ బస్టర్ సాంగ్ అందరికీ గుర్తుండే ఉంటుంది. ’30 రోజుల్లో ప్రేమించడం ఎలా?’ అనే చిత్రంలోని ఈ పాట ఆ చిత్రం సక్సెస్ సాధించడంలో కీలక పాత్ర పోషించింది. ఇప్పుడు అలాంటి మరో చార్ట్ బస్టర్ సాంగ్ తో వచ్చేశారు సంగీత దర్శకులు అనూప్ రూబెన్స్, సిద్ శ్రీరామ్. వివరాల్లోకి వెళితే.. ’30 రోజుల్లో ప్రేమించడం ఎలా?’ చిత్రం దర్శకుడు మున్నా  ధూళిపూడి  ‘బ్యాడ్ గాళ్స్’ అనే సినిమాను తెరకెక్కిస్తున్నారు. ‘కానీ చాలా మంచోళ్ళు’ అనేది దీని క్యాప్షన్. ‘నీలి నీలి  క్రియేషన్స్’ ‘ప్రశ్విత ఎంటర్‌టైన్‌మెంట్’ ‘ఎన్‌వీఎల్ క్రియేషన్స్’ సంస్థలపై  శశిధర్ నల్ల, ఇమ్మడి సోమ నర్సయ్య, రామిశెట్టి రాంబాబు, రావుల రమేష్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అంచల్ గౌడ, పాయల్ చెంగప్ప, రోషిణి, యష్ణ, రోహన్ సూర్య తదితరులు ఈ చిత్రంలో నటిస్తున్నారు. 

Bad Girlz


ఇక ‘బ్యాడ్ గాళ్స్’ చిత్రం నుండి తాజాగా ‘ఇలా చూసుకుంటానే’ అనే మెలోడీ సాంగ్ ను రానా దగ్గుబాటి తన సోషల్ మీడియా ద్వారా విడుదల చేశారు. అలాగే పాట వినడానికి చాలా బాగుంది అంటూ ప్రశంసించారు.అనూప్ రూబెన్స్ సంగీతంలో రూపొందిన ఈ పాటకు ఆస్కార్ విన్నర్ లిరిసిస్ట్ చంద్రబోస్ సాహిత్యం అందించగా స్టార్ సింగర్ సిద్ శ్రీరామ్ ఆలపించడం విశేషంగా చెప్పుకోవాలి. ఇలా పాట రిలీజ్ అయ్యిందో లేదో సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. దీంతో చిత్ర బృందం ఆనందం తెలిపారు. సాంగ్ ను లాంచ్ చేసిన రానా దగ్గుబాటికి కూడా థాంక్స్ చెప్పారు. ‘నీలి నీలి ఆకాశం’ పాటకి సీక్వెల్ గా దీనిని రూపొందించినట్టు కూడా ఈ సందర్భంగా వెల్లడించారు. జమ్మూ కాశ్మీర్ మరియు మలేషియా వంటి లొకేషన్స్ లో ఈ పాటను చిత్రీకరించారని ఈ సందర్భంగా టీం చెప్పుకొచ్చింది.
ఇక ‘బ్యాడ్ గాళ్స్’ చిత్రం  యూత్ ఫుల్ అండ్ ఫ్యామిలీ ఎలిమెంట్స్ తో కూడిన వినోదాత్మక కథతో రూపొందినట్లు తెలుస్తోంది.ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ సినిమా అతి త్వరలో విడుదల కానుంది అని చిత్ర బృందం వెల్లడించింది

‘కూలీ’ మళ్ళీ వెనుకబడింది

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus