తన ప్రియుడితో బ్రేక్ అప్ అయిన ఇలియానా?

టాలీవుడ్లో కొన్నాళ్ళు సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా కొనసాగింది ఇలియానా. ‘దేవదాస్’ ‘పోకిరి’ ‘జల్సా’ ‘కిక్’ ‘జులాయి’ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాల్లో నటించింది. కెరీర్ పీక్స్ లో ఉన్న తరుణంలో బాలీవుడ్ కు చెక్కేసింది. అక్కడ కూడా ఈమె మంచి క్రేజ్ ను సంపాదించుకుంది. చాలా గ్యాప్ తరువాత ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ చిత్రంతో టాలీవుడ్ కు రీ ఎంట్రీ ఇచ్చింది. ఇక ఆండ్రూ నీబోన్ అనే ఆస్ట్రేలియన్ ఫొటోగ్రాఫర్ తో ఇలియానా ప్రేమాయణం నడిపిన సంగతి తెలిసిందే. వీరిద్దరూ కలసి ఉన్న చాలా ఫొటోలు సోషల్ మీడియాలో రచ్చ చేసాయి కూడా.

అయితే, ఇప్పుడు ఇలియానా ఆండ్రూ తో బ్రేక్ అప్ అయ్యిందని టాక్ వినిపిస్తుంది. దీనికి అసలు కారణం.. ఇన్స్టాగ్రామ్ లో వీరిద్దరూ ఒకరినొకరు ‘అన్ ఫాలో’ కావడమే అని తెలుస్తుంది. అంతేకాదు, ఇద్దరూ కలసి ఉన్న ఫొటోలను కూడా ఆండ్రూ డిలీట్ చేయడం గమనార్హం. వీళ్ళిద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయని… అందుకే విడిపోయారని బాలీవుడ్ లో గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి. 2017 సంవత్సరంలో క్రిస్మస్ సమయంలో ‘అండ్రూ నీబోన్ ను నాకు కాబోయే భర్త అంటూ ఇలియానా’ ఓ పోస్ట్ పెట్టింది. అంతకు ముందు ‘ఓ విదేశీయుడితో డేటింగ్ చేస్తున్నానని’ ఆమె తెలిపిన సంగతి కూడా తెలిసిందే. జూలై 19న కూడ ఆండ్రూ కి పుట్టినరోజు శుభాకాంక్షలు కూడా తెలిపింది. మరి ఈ గ్యాప్ లో ఏం జరిగిందో ఏమో తెలీదు.. ఇద్దరూ విడిపోయినట్టే అని తెలుస్తుంది.

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus