రవితేజ పైన ఇలియానా వేసిన సెటర్లపై అభిమానుల ఆగ్రహం

‘అమర్ అక్బర్ ఆంటోని’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ రెండు రోజుల క్రితం చాలా గ్రాండ్ గా జరిగింది. ప్రమోషన్స్ కి దూరంగా ఉండే ఇలియానా చాలా గ్యాప్ తరువాత నటిస్తుండటం, అసలు ఆమె ఫంక్షన్ కి వస్తుందో రాదో అనే సందేహం కూడా ముందు చాలా మందిలో ఉండేది. కానీ ఇలియానా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వచ్చి అందరిని సర్ప్రైజ్ చేసింది. ఇక అందరిని చిరునవ్వుతో పలకరిస్తూ ఫంక్షన్ కి సెంటర్ ఆఫ్ అట్రాక్క్షన్ గా నిలిచింది. ఇక శ్రీనువైట్ల, రవితేజ కాంబినేషన్ లో ఈ సినిమా రావడం, ఇందులో రవితేజ మూడు డిఫరెంట్ క్యారెక్టర్ లో నటిస్తుండంతో సినిమా పైన ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి.

ఇక విషయంలోకి వెళితే, ఫంక్షన్ కి వచ్చిన ఇలియానా మాట్లాడుతూ చాలా గ్యాప్ తరువాత తెలుగులో సినిమా చేస్తూ తెలుగు ప్రేక్షకులని పలకరించడం చాలా సంతోషంగా ఉందని చెప్పింది. ఇక హీరో రవితేజకి సిక్స్ ప్యాక్ ఉందటూ ఇలియానా ఫంక్షన్ లో చెప్పడంతో, సినిమా ట్రైలర్ లో సిక్స్ ప్యాక్ బాడీని ఎక్కడ చూపించకపోవడంతో నిజంగా రవితేజ సిక్స్ ప్యాక్ తో సినిమాలో కనిపిస్తాడా లేదా ఇలియానా కావాలనే ఏదో ఫన్నీ కామెంట్స్ చేసిందా అనే ఆలోచనలో రవితేజ అభిమానులు ఆమె పైన ఆగ్రహంగా ఉన్నట్లుగా తెలుస్తుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus