గోవా బ్యూటీ ఇలియానా దేవదాసు సినిమా ద్వారా ప్రేక్షకులకు పరిచయమై మొదటి సినిమాతోనే ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. ఈ సినిమా తర్వాత పోకిరి సినిమాలో నటించిన ఈమె బ్లాక్ బస్టర్ అందుకొని కెరియర్ పరంగా ఇండస్ట్రీలో వెనక్కి తిరిగి చూడలేదు ఇలా ఒకానొక సమయంలో సౌత్ ఇండస్ట్రీని ఏలినటువంటి ఇలియానా అనంతరం అవకాశాలు లేక ఇండస్ట్రీకి దూరమయ్యారు. ఇలా ఇండస్ట్రీకి దూరమైనటువంటి ఈమె బాలీవుడ్ ఇండస్ట్రీలో ఆయన తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని అక్కడికి వెళ్లారు
అయితే బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా పెద్దగా సక్సెస్ అందుకోకపోవడంతో సోషల్ మీడియాలో కాలక్షేపం చేస్తూ తన గ్లామరస్ ఫోటోలను అభిమానులతో పంచుకునేవారు. అయితే ఈమె పెళ్లి చేసుకున్నటువంటి విషయాన్ని దాచి ఉంచి ఏకంగా ప్రెగ్నెంట్ అనే విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ప్రకటించడంతో అందరూ షాక్ అయ్యారు. తన ప్రెగ్నెన్సీ విషయాన్ని ప్రకటించిన తర్వాత ఇలియానా తన ప్రేగ్నెన్సీకి సంబంధించిన అన్ని విషయాలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకునేవారు
అయితే తన (Ileana) ప్రేగ్నెన్సీకి కారణమైనటువంటి వ్యక్తిని మాత్రం పరిచయం చేయలేదు ఇక తనకు బిడ్డ జన్మిస్తారన్న కొద్ది రోజుల ముందు ఈమె తన లైఫ్ పార్ట్నర్ ఫోటోతో పాటు ఆయన విషయాలన్నింటినీ కూడా వెల్లడించారు ఇక ఇలియానా ఆగస్టు ఒకటవ తేదీ పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చిన విషయం మనకు తెలిసిందే.ఈమె తన కొడుకు ఫోటోను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ తన కుమారుడి పేరు కోఫోనిక్స్ డోలన్ అని తెలియజేశారు.
ఇలా తరచూ తన కొడుకు ఫోటోలను షేర్ చేస్తూ ఉండే ఈమె తాజాగా మరోసారి సోషల్ మీడియా వేదికగా తన కుమారుడి ఫోటోలను షేర్ చేశారు. ఇలియానా తన కొడుకుని ఎత్తుకొని ఉండగా బాబు తన భుజంపై వాలి నిద్రపోతూ ఉన్నటువంటి ఫోటోని షేర్ చేశారు. ఈ ఫోటోని షేర్ చేసినటువంటి ఈమె అప్పుడే రెండు నెలలు పూర్తి అయ్యాయి అంటూ క్యాప్షన్ పెట్టారు. దీంతో ఈ ఫోటో వైరల్ గా మారింది.