మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాల IMDB రేటింగ్స్!

టాలీవుడ్లో దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ను అందరూ గురూజీ అని అంటుంటారు. తన మొదటి సినిమా ‘నువ్వే నువ్వే’ నుండీ మొన్న వచ్చిన ‘అల వైకుంఠపురములో’ సినిమా వరకూ అతని సినిమాల్లో స్టైలిష్ టేకింగ్ తో పాటు హృదయాన్ని తట్టి లేపే డైలాగులు కూడా ఉంటాయి అనడంలో సందేహం లేదు. ‘మనకి జ్వరం వచ్చినప్పుడు డాక్టర్ ఇంజక్షన్ చేసే సమయంలో దూదితో రుద్ది.. ఆ తరువాత సూది దింపితే ఎలా ఉంటుందో’ మన త్రివిక్రమ్ దర్శకత్వం వహించే సినిమాల్లో డైలాగులు కూడా అలాగే ఉంటాయని చెప్పొచ్చు. ఈయన సినిమాల్లో అద్భుతమైన ఫ్యామిలీ ఎమోషన్స్ ఉంటాయి.. సందర్భానికి తగినట్టు పాటలు వస్తుంటాయి. అందుకే త్రివిక్రమ్ సినిమాల్ని థియేటర్లో అందరూ చూసినప్పటికీ.. టీవీల్లో రిపీటెడ్ గా చూస్తుంటారు.

ఒక్క ‘అజ్ఞాతవాసి’ సినిమాని పక్కన పెట్టేస్తే… ‘ఖలేజా’ వంటి డిజాస్టర్ సినిమాతో సహా త్రివిక్రమ్ తెరకెక్కించిన అన్ని సినిమాలకు కూడా కల్ట్ ఫ్యాన్స్ ఉన్నారు అంటే ఆశ్చర్యం లేదు. ఇదిలా ఉండగా.. ప్రఖ్యాత ఇంటర్నెట్ మూవీ డేటాబేస్(ఐ.ఎం.డి.బి) సంస్థ సినిమాలకు ఇచ్చే రేటింగ్స్ పై ప్రేక్షకులకు మంచి నమ్మకం ఉంటుంది. మరి మన త్రివిక్రమ్ సినిమాలకు ఐ.ఎం.డి.బి సంస్థ ఇచ్చిన రేటింగ్స్ ఎలా ఉన్నాయో ఓ లుక్కేద్దాం రండి :

1) నువ్వే నువ్వే : 7.4 రేటింగ్

2)అతడు : 8.2 రేటింగ్

3)జల్సా :7.3 రేటింగ్

4)ఖలేజా : 7.5 రేటింగ్

5)జులాయి : 7.2 రేటింగ్

6)అత్తారింటికి దారేది : 7.2 రేటింగ్

7)సన్ ఆఫ్ సత్యమూర్తి : 6.9 రేటింగ్

8)అఆ : 6.8 రేటింగ్

9)అజ్ఞాతవాసి : 4.5 రేటింగ్

10) అరవింద సమేత : 7.7 రేటింగ్

11)అల వైకుంఠపురములో : 7.2 రేటింగ్

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus