Imitation Raju: ఇమిటేషన్‌ రాజు వైరల్‌ ఫీట్‌ చూశారా!

ఇమిటేషన్‌ రాజు… మిమిక్రీ అంటే ఇష్టం ఉండే అందరికీ ఈ పేరు బాగా పరిచయమే. సినిమా తారల వాయిస్‌, బాడీ లాంగ్వేజ్‌ పక్కాగా ఇమిటేట్‌ చేస్తూ ఉంటాడు. ఇప్పటికే చాలా వేదికల మీద తన ప్రతిభ చూపించారు ఇమిటేషన్‌ రాజు. తాజాగా ఆయన చేసిన ఓ ఫీట్‌ ఇప్పుడు వైరల్‌ అవుతోంది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 30కిపైగా వాయిస్‌లను కేవలం ఆరు నిమిషాల్లో మిమిక్రీ చేసి అలరించారాయన.

ఈటీవీలో ప్రసారమయ్యే ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’ కార్యక్రమం ఇమిటేషన్‌ రాజు వైరల్‌ ఫీట్‌కు వేదికైంది. ఇటీవల ప్రసారమైన ఎపిసోడ్‌లో స్పాట్‌ డబ్బింగ్‌ తరహాలో స్పాట్‌ మిమిక్రీ చేసి అలరించారు ఇమటేషన్‌ రాజు. ఈ తరహా ప్రక్రియ ఇదే తొలిసారి అని రాజు చెప్పారు. సుమారు ఆరు నిమిషాల సమయంలో రకరకాల భావోద్వేగాలతో… రకరకాల పాత్రలను ఇమిటేట్‌ చేస్తూ, మిమిక్రీ చేశారు. కొత్త, పాత అని లేకుండా 33 మంది ప్రముఖ నటుల వాయిస్‌ని అచ్చుగుద్దినట్లు దింపేశారు.

సాయి కుమార్‌, బాలకృష్ణ, రావు గోపాలరావు, మోహన్‌ బాబు, చిరంజీవి, కృష్ణ, కృష్ణంరాజు, చిరంజీవి, సుధాకర్‌, శ్రీహరి, నాగార్జున, ప్రభాస్‌, రాళ్లపల్లి, కమల హాసన్‌, పోసాని కృష్ణమురళి, జీవా, నాగేశ్వరరావు, కైకాల సత్యనారాయణ…. ఇలా అందరినీ కవర్‌ చేసేశారు. కావాలంటే ఆ వీడియో మీరూ చూడండి.. అవాక్కవుతారు!


పెళ్లి దాకా వచ్చి విడిపోయిన జంటలు!
తమిళ హీరోలు తెలుగులో చేసిన స్ట్రైట్ మూవీస్ లిస్ట్!
దర్శకులను ప్రేమించి పెళ్లి చేసుకున్న హీరోయిన్స్

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus