Chiranjeevi: ఆ టైములో చిరు ఆ ఘోరమైన నిర్ణయం తీసుకున్నారట..!

  • March 28, 2022 / 03:43 PM IST

మెగాస్టార్ చిరంజీవి ఎక్కడో మొగల్తూరులో పుట్టి పెరిగిన ఈయన సినిమాల పై ఉన్న మక్కువతో మద్రాసు వచ్చి నటనలో శిక్షణ పొందారు. ఒక రెండేళ్ళ పాటు మాత్రమే ఈయన సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నించాలని, కుదరని పక్షంలో తన చదువుకి తగ్గ ఉద్యోగం వెతుక్కోవాలని డిసైడ్ అయ్యారు. ఇదే విషయాన్ని ఆయన పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు. ఈయన కష్టానికి తగ్గ ఫలితం అనుకూలంగానే వచ్చింది. మొదట్లో నెగిటివ్ రోల్స్, సైడ్ క్యారెక్టర్లు చేస్తూ వచ్చిన ఈయన తర్వాత హీరోగా మారారు.

Click Here To Watch NOW

1978వ సంవత్సరం నుండీ మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాల్లో నటిస్తూనే వచ్చారు. ఇదే క్రమంలో ‘ఖైదీ’ చిత్రం వచ్చి సూపర్ హిట్ అయ్యి ఈయనకి స్టార్ ఇమేజ్ ను కట్టబెట్టింది. అటు తర్వాత ఈయన వరుస సినిమాల్లో నటిస్తూ వరుసగా హిట్లు కొడుతూ వచ్చారు. అయితే 1994,95 సంవత్సరాల్లో ఈయన నటించిన సినిమాలు ఎస్.పి.పరశురామ్, బిగ్ బాస్, రిక్షావోడు ప్లాప్ లు అయ్యాయి. ఒక్క ముగ్గురు మొనగాళ్ళు యావరేజ్ గా నిలిచింది.

ఈ టైంలో చిరు పై చాలా విమర్శలు వెల్లువెత్తాయి. చిరంజీవి పని అయిపోయిందని, ఆయన హిట్లు కొట్టడం ఇక కష్టమే అని.. ఇలా ఘోరమైన కామెంట్లు చాలానే వినిపించాయి. చిరు కూడా ఆ టైములో ఫ్యామిలీ రాజశేఖర్ లా ఫ్యామిలీ ఓరియెంటెడ్ సినిమాలు చేయాలని, మాస్ సినిమాల జోలికి పోకూడదని భావించారట. దాంతో 1996 వ సంవత్సరం మొత్తం ఆయన కథలు వినడానికే డిసైడ్ అయ్యారు. కొంత గ్యాప్ తీసుకున్నా పర్వాలేదు హిట్ కొట్టాలని భావించారు చిరు.

అలా మలయాళంలో మమ్ముట్టి నటించిన ‘హిట్లర్’ మూవీ కథ విన్నారు. మొదట ఈ ప్రాజెక్టు మోహన్ బాబు- ఇ.వి.వి.సత్యనారాయణ కాంబినేషన్లో రూపొందుతుంది అంటూ ప్రచారం జరిగింది. కానీ వాళ్ళ కాంబోలో అప్పటికే మరో సినిమా రూపొందుతుండడంతో అది జరగలేదు. అలా అది చేతులు మారుతూ చిరు- ముత్యాల సుబ్బయ్య చేతులకి వెళ్ళింది. 1997 వ సంవత్సరంలో సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ మూవీ సూపర్ హిట్ గా నిలిచింది.

ఆర్ఆర్ఆర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘బాహుబలి’ కి ఉన్న ఈ 10 అడ్వాంటేజ్ లు ‘ఆర్.ఆర్.ఆర్’ కు లేవట..!
‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ గురించి ఈ 11 ఇంట్రెస్టింగ్ విషయాలు మీకు తెలుసా?
‘పుష్ప’ తో పాటు బుల్లితెర పై రికార్డ్ టి.ఆర్.పి లు నమోదు చేసిన 10 సినిమాల లిస్ట్…?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus