సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ సాధించిన ప్రతి ఒక్కరి విజయం వెనుక ఎన్నో కష్టాలు ఉంటాయి. ఎన్నో అవమానాలను ఎదుర్కొంటే మాత్రమే కెరీర్ పరంగా సక్సెస్ సాధించడం సాధ్యమవుతుంది. ప్రముఖ నటి హిందూజా రవిచంద్రన్ తాజాగా ఒక సందర్భంలో మాట్లాడుతూ ఒక్కొక్కరికి ఒక్కో రకమైన కిక్ ఉంటుందని అలా నాకు నటించడంలోనే కిక్ కలుగుతుందని చెప్పారు. సినిమాలో నటిస్తున్న సమయంలో నేను హిందూజా అనుకోనని పాత్ర స్వభావాన్ని బట్టి మారడం నాకు కిక్ ఇస్తుందని ఆమె చెప్పుకొచ్చారు.
మేయాదమాన్ సినిమాతో నటిగా కెరీర్ ను మొదలుపెట్టిన ఈ నటి నానే వరువేన్, ముకుత్తి అమ్మన్, మహాముని, బిల్లా పిండి సినిమాలతో మంచి పేరును సంపాదించుకున్నారు. ప్రస్తుతం హిందూజ పార్కింగ్ సినిమాలో హరీష్ కళ్యాణ్ కు జోడీగా నటిస్తున్నారు. పార్కింగ్ మూవీలో తాను టీచర్ రోల్ లో నటిస్తున్నానని ఆమె తాజాగా చెప్పుకొచ్చారు. పార్కింగ్ లో తలెత్తే సమస్యలు, తద్వారా ఎదురయ్యే పరిణామాల గురించి ఈ సినిమాలో చర్చించనున్నారు.
ఈ సినిమాలో కొన్ని ఛాలెంజింగ్ సీన్స్ లో నటించానని ఆమె చెప్పుకొచ్చారు. తాను హీరోయిన్ గా చేయాలని భావించి సినిమా ఇండస్ట్రీలోకి వచ్చానని అయితే కెరీర్ తొలినాళ్లలో తాను క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించానని ఆమె కామెంట్లు చేశారు. వరుసగా సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తే అలాంటి ముద్ర వేస్తారని భావించి ఆ పాత్రలకు దూరంగా ఉన్నానని హిందూజ (Indhuja Ravichandran) చెప్పుకొచ్చారు.
తాను తమిళ్ అమ్మాయినని చెప్పగా కొంతమంది నన్ను హేళనగా చూశారని ఆమె కామెంట్లు చేశారు. నన్ను ఎందుకు ఆ విధంగా చూస్తున్నారో అప్పుడు అర్థం కాలేదని అప్పటికీ ఇప్పటికీ పరిస్థితి మారిపోయిందని హిందూజ చెప్పుకొచ్చారు. హిందూజ వెల్లడించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. ఆమెకు తెలుగులో మరిన్ని విజయాలు దక్కాలని అభిమానులు కోరుకుంటున్నారు. హిందూజకు క్రేజ్ అంతకంతకూ పెరుగుతోంది.
ఆ హీరోల భార్యల సంపాదన ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
రాంచరణ్ టు నాని.. ఈ 10 మంది హీరోలకి మొదటి వంద కోట్ల సినిమాలు ఇవే..!
పాత్ర కోసం ఇష్టాలను పక్కన పడేసిన నటులు వీళ్లేనా..!