మ్యూజిక్ రంగంలో దిగ్గజం, మ్యూజిక్ మాస్ట్రో…టాప్ మ్యూజిక్ డైరెక్టర్, ప్రపంచం ప్రఖ్యాతి గాంచిన పాటల మాంత్రికుడు ఎ.ఆర్ రెహ్మాన్ కు మళ్ళీ ఆస్కార్ దక్కే అవకాశాలు ఉన్నాయా? విషయం చూస్తుంటే అలానే అనిపిస్తుంది…ఇంతకీ మ్యాటర్ ఏమిటంటే…ఇప్పటికే రెండు సార్లు ఆస్కార్ ను అందుకున్న రెహ్మాన్ ముచ్చటగా మూడో సారి కూడా అందుకుని హ్యాట్రిక్ కొట్టాలి అని ఆలోచనలో ఉన్నట్లు సమాచారాం….అసలు విషయం ఏమిటంటే….బ్రెజిల్ ఫుట్‌బాల్ దిగ్గజ క్రీడాకారుడు పీలే జీవితగాథ ‘పీలే: బర్త్ ఆఫ్ ఏ లెజెండ్’ సినిమాకు ఆయన ఉర్రూతలూగించే సంగీతాన్ని స్వరపరిచిన సంగతి తెలిసిందే. బ్రెజిల్ కు చెందిన ప్రపంచ ప్రఖ్యాత సాకర్ ప్లేయర్ పీలే బయోపిక్ అయిన ‘పీలే: బర్త్ ఆఫ్ ఏ లెజెండ్’ చిత్రం ద్వారా ఆస్కార్ పోటీలో నిలిచారు.
ఒరిజినల్ స్కోర్, ఒరిజినల్ సాంగ్ విభాగాలకుగాను రెహమాన్ పోటీ పడుతున్నారు. నామినేషన్ల తుది జాబితాను జనవరి 24న విడుదల చేస్తారు. దీనిలో ‘జింగా’ పాట మనల్ని ఫుట్‌బాల్ ప్రపంచంలోకి తీసుకుపోతుందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. రెహమాన్‌ను ఆస్కార్ వైపు నడిపిస్తోంది కూడా ఈ పాటే. ఉత్తమ ఒరిజినల్ స్కోర్ విభాగంలో 145 పాటలతో ఇది పోటీ పడుతోంది. మరోవైపు ఒరిజినల్ సాంగ్ విభాగంలోనూ ఇది 91 పాటలతో పోటీకి నిలిచింది. మరి గతంలో 2009లో ‘స్లమ్ డాగ్ మిలియనీర్’ చిత్రానికి గాను రెహమాన్ రెండు ఆస్కార్ అవార్డులు అందుకున్న విషయం తెలిసిందే…అదే విధంగా ఈ సారి కూడా అందుకుంటే రెహ్మాన్ ఆస్కార్ హ్యాట్రిక్ కొట్టినట్లే… మరి చూడాలి బ్ల్యాక్ లేడీ మన వాణ్ణి దక్కించుకుంటుందో లేదో…
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.