Indra Re-Release: అప్పుడు ‘ఇంద్ర’ రికార్డుని మహేష్ బ్రేక్ చేశాడు.. ఇప్పుడు మహేష్ రికార్డుని ‘ఇంద్ర’ బ్రేక్ చేస్తుందా?

మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi)  , దర్శకుడు బి.గోపాల్ (B. Gopal)  కలయికలో రూపొందిన ‘ఇంద్ర’ (Indra) చిత్రం చారిత్రాత్మక విజయం సాధించిన సంగతి తెలిసిందే. 2002 జూలై 24 న ఈ చిత్రం రిలీజ్ అయ్యింది. దీనికి ముందు చిరంజీవి నటించిన ‘మృగరాజు’ (Mrugaraju) ‘డాడీ’ (Daddy) వంటి సినిమాలు నిరాశపరిచాయి. అందువల్ల ‘ఇంద్ర’ పెద్దగా అంచనాలు లేకుండానే రిలీజ్ అయ్యింది. అయితే మొదటి షోతోనే సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుని.. షో షోకి స్క్రీన్స్ పెంచుకుంటూ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించింది.

Indra Re-Release

ఆ టైంలో ‘ఇంద్ర’ 122 కేంద్రాల్లో 100 రోజులు ప్రదర్శింపబడి ఆల్ టైం రికార్డులు క్రియేట్ చేసింది. అంతేకాదు బాక్సాఫీస్ వద్ద 28 కోట్ల భారీ షేర్ ను సాధించి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఆ తర్వాత ‘ఇంద్ర’ కలెక్షన్స్ ను అధిగమించి ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన సినిమా ‘పోకిరి’ (Pokiri) అనే చెప్పాలి. 2006 లో రిలీజ్ అయిన ‘పోకిరి’ బాక్సాఫీస్ వద్ద రూ.37 కోట్ల పైనే షేర్ ను కలెక్ట్ చేసి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.

అలా ఆ టైంకి ‘ఇంద్ర’ రికార్డుని మహేష్ బ్రేక్ చేయడం జరిగింది. ఇదిలా ఉంటే.. రీ రిలీజ్..లా ట్రెండ్ ముగిసింది అనుకున్న టైంలో, ఇటీవల ‘మురారి’ (Murari) సినిమా రీ రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద రూ.8 కోట్ల పైనే గ్రాస్ ను కలెక్ట్ చేసి.. రీ రిలీజ్ సినిమాల్లో ఆల్ టైం రికార్డులు క్రియేట్ చేసింది. రీ రిలీజ్ సినిమాల్లో ఇప్పుడు ‘మురారి’ నే నెంబర్ వన్.

అయితే మరో రెండు రోజుల్లో ‘ఇంద్ర’ కూడా రీ రిలీజ్ కాబోతోంది. దీనిపై కూడా అంచనాలు భారీగా ఉన్నాయి. మరి ఈసారి మహేష్ రికార్డులని ‘ఇంద్ర’ బ్రేక్ చేసి.. బాక్సాఫీస్ రివేంజ్ తీర్చుకుంటుందా అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న? చూడాలి మరి ఏమవుతుందో.

నాగచైతన్య కొత్త సినిమాలో నాగార్జున కూడా.. ఏ సినిమా అంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus