Nagarjuna, Naga Chaitanya: నాగచైతన్య కొత్త సినిమాలో నాగార్జున కూడా.. ఏ సినిమా అంటే?

నాగార్జున (Nagarjuna) – నాగచైతన్య (Naga Chaitanya) ఒకే ఫ్రేమ్‌లో కనిపిస్తే అక్కినేని అభిమానులకు వచ్చే కిక్కే వేరు. అందుకే ఈ కాంబోను ఎన్నిసార్లు చూసినా చూడాలని అనిపిస్తుంది అంటుంటారు. వాళ్ల కోరికలకు తగ్గట్టే అక్కినేని వారసులు ఒకే సినిమాలో నటించి వావ్‌ అనిపించారు కూడా. తాజాగా మరోసారి ఆ ఆనందం కలిగించడానికి రెడీ అవుతున్నారా? అవుననే అంటున్నాయి టాలీవుడ్‌ వర్గాలు. చైతు కొత్త సినిమాలో నాగ్‌ కూడా నటిస్తాడు అని చెబుతున్నారు.

Nagarjuna, Naga Chaitanya

సాయి తేజ్‌ (Sai Dharam Tej) లేటెస్ట్‌ హిట్‌ సినిమా ‘విరూపాక్ష’ (Virupaksha) తో తొలి ప్రయత్నంతోనే భారీ విజయం అందుకున్న దర్శకుడు కార్తీక్ దండు (Karthik Varma Dandu) .. రెండో సినిమాకు రంగం సిద్ధమైంది. ఆ సినిమాకు సంబంధించి తాజాగా ఓ వార్త బయటకు వచ్చింది. నాగ చైతన్య హీరోగా కార్తీక్ దండు దర్శకత్వం వహించినబోయే కొత్త ప్రాజెక్టులో నాగార్జున కూడా నటిస్తాడు అని అంటున్నారు. ఈ మేరకు నాగ్‌ కోసం ఓ పవర్‌ఫుల్‌ పాత్రను రాసుకున్నారట.

సినిమా ప్లాష్ బ్యాక్ లో ఓ పవర్ ఫుల్ పాత్రను కార్తిక్‌ దండు రాసుకున్నారని, దానికి నాగార్జున అయితే న్యాయం చేయగలరు అని అనుకుంటున్నారని టాలీవుడ్‌ వర్గాల్లో ఓ టాక్‌ వినిపిస్తోంది. ప్రస్తుతం నాగార్జున ఇలాంటి అతిథి పాత్రలు, ఎక్స్‌టెండెడ్‌ అతిథి పాత్రలకు ఓకే చెబుతున్నారు. ఈ క్రమంలో ఈ సినిమాకూ ఓకే చెప్పడం పెద్ద విషయం కాదు. ఇక ఇది కొడుకు సినిమానే కాబట్టి నాగార్జున ఈజీగానే ఒప్పేసుకుంటారు.

ఇక్కడో విషయం ఏంటంటే.. నాగార్జున పాత్ర నిడివి కేవలం పది నిమిషాలే అని అంటున్నారు. అయితే కథకు చాలా కీలకమట. ఈ సినిమా కోసం చైతు లుక్ ట్రై చేస్తాడు అంటున్నారు. ప్రస్తుతం చైతన్య – సాయిపల్లవి (Sai Pallavi) కలసి నటిస్తున్న ‘తండేల్‌’ (Thandel) సినిమా తర్వాత కార్తిక్‌ దండు సినిమా ఉంటుంది అని చెబుతున్నారు. ‘తండేల్‌’ సినిమాను పాన్‌ ఇండియా లెవల్‌లో తెరకెక్కిస్తున్నారు. సినిమా కాన్సెప్ట్‌ కూడా అచ్చంగా అలాంటిదే.

ఫ్యాన్స్ కు సామ్ ఇచ్చిన స్పెషల్ సర్ప్రైజ్ ఇదే.. ఎవరూ ఊహించలేదుగా!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus