Adhurs: అదుర్స్ రీరిలీజ్ విషయంలో తప్పు జరుగుతోందా.. థియేటర్లు ఎక్కడంటూ?

జూనియర్ ఎన్టీఆర్ వినాయక్ కాంబినేషన్ లో తెరకెక్కిన అదుర్స్ సినిమా 2010 సంవత్సరంలో థియేటర్లలో విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకుంది. అదుర్స్ మూవీకి సీక్వెల్ తెరకెక్కితే బాగుంటుందని ఫ్యాన్స్ ఫీలయ్యారు. ఈ నెల 18వ తేదీన ఈ సినిమా రీ రిలీజ్ అవుతోంది. అయితే చాలా పరిమిత సంఖ్యలో థియేటర్లలో లిమిటెడ్ షోస్ తో ఈ సినిమా రీ రిలీజ్ అవుతుండటం ఫ్యాన్స్ ను బాధ పెడుతోంది. హైదరాబాద్ లో కేవలం 4 థియేటర్లలో ఒక్కో థియేటర్ లో ఒక్కో షో మాత్రమే అదుర్స్ ప్రదర్శితం అవుతుండటం హాట్ టాపిక్ అవుతోంది.

కర్నూలు జిల్లాలో అదుర్స్ మూవీ కేవలం ఒకే ఒక్క షో ప్రదర్శితం అవుతుండటం గమనార్హం. ప్రస్తుతం థియేటర్లలో మరీ క్రేజ్ ఉన్న పెద్ద హీరోల సినిమాలేవీ ప్రదర్శితం కావడం లేదు. అదుర్స్ రీ రిలీజ్ ప్లానింగ్ విషయంలో పొరపాట్లు జరుగుతున్నాయని కొంతమంది ఫ్యాన్స్ చెబుతున్నారు. ప్రముఖ టికెట్ బుకింగ్ యాప్ లో అయితే హైదరాబాద్ లో అదుర్స్ మూవీ బుకింగ్స్ ఒక్క థియేటర్ లో కూడా కనిపించడం లేదు.

అదుర్స్ (Adhurs) సినిమాను రీ రిలీజ్ చేస్తున్న వాళ్లు ఈ కామెంట్లపై ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది. అదుర్స్ మూవీని సరైన ప్లానింగ్ తో రీరిలీజ్ చేస్తే అదిరిపోయే కలెక్షన్లను సాధిస్తుందని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. అదుర్స్ తక్కువ సంఖ్యలో థియేటర్లలో రిలీజ్ అవుతుండటంతో కలెక్షన్లు ఏ విధంగా ఉంటాయో చూడాలి. మరోవైపు ఎన్టీఆర్ దేవర మూవీకి సంబంధించిన ప్రమోషన్స్ 2024 సంవత్సరం జనవరి నుంచి మొదలుకానున్నాయి.

దేవరకు సంబంధించిన కథ, కథనం కొత్తగా ఉన్నాయని తెలుస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన టీజర్ రిలీజ్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తుండగా త్వరలో టీజర్ గురించి పూర్తిస్థాయిలో క్లారిటీ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. తారక్ సినిమాల రేంజ్ అంతకంతకూ పెరుగుతోంది.

జపాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

జిగర్ తండ డబుల్ ఎక్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ వారం థియేటర్/ఓటీటీల్లో రిలీజ్ కాబోతున్న 35 సినిమాలు/సిరీస్..ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus