అందాల రాక్షసిగా తెలుగు తెరకు పరిచయమైన లావణ్య త్రిపాఠి… మెల్లగా టాప్ హీరోయిన్ రేంజికి చేరుకుంటుంది. భలే భలే మగాడివోయ్, సోగ్గాడే చిన్ని నాయనా సినిమాల తరువాత ఆమె కెరీర్ ఒక్కసారిగా ఊపందుకుంది. అంతేనా ఆ సినిమాలు ఇచ్చిన విజయాలు రెమ్యునరేషన్ కూడా పెంచేలా చేశాయి. గతేడాదంతా మంచి ఊపు మీద ఉంది లావణ్య… ఆ ఏడాది ఆరు సినిమాలలో నటించింది మరి. ఆ ఆరు సినిమాల వల్లే ఇప్పుడు లావణ్య… చేతిలో ఒకే ఒక్క సినిమాతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇంతగా ఆ టాప్ హీరోయిన్ ఎందుకు డల్ అయ్యింది? గతేడాది విడుదలైన మిస్టర్ పై లావణ్య ఎన్నో ఆశలు పెట్టుకుంది. అది కాస్త అట్టర్ ఫ్లాప్ అయ్యింది. తరువాత విడుదలైన రాధ యుద్దం శరణం కూడా అదే రీతిలో బాక్సాఫీసు దగ్గర బోల్తా పడ్డాయి. కనీసం ఆసినిమాలో లావణ్య ఉందన్న సంగతి కూడా సగం మందికి తెలియదు. ఆ తరువాత రామ్ తో చేసిన ఉన్నది ఒకటే జిందగీ మాత్రం కాస్త ఫర్వాలేదనిపించింది.
అయినా ఆ సినిమాలో అనుపమా పరమేశ్వరన్ మెయిన్ హీరోయిన్గా పేరు తెచ్చుకుంది. లావణ్య పాత్ర సైడ్ క్యారెక్టర్లా అయిపోయింది. తమిళంలో విడుదలైన సినిమా కూడా ఫ్లాఫే. అందులోనూ రెమ్యునరేషన్ కూడా భారీగా అడుగుతుండడంతో లావణ్య జోలికి దర్శక నిర్మాతలు పోవడం లేదు. దీంతో అందాల రాక్షసి పరిస్థితి అద్వానమైపోయింది. ఇప్పుడామెకు ఉన్న ఒకే ఒక్క ఆశ.. ఇంటెలిజెంట్ సినిమానే. ఫిబ్రవరిలో విడుదలయ్యే ఆ సినిమా కోసం ప్రమోషన్లలో బిజీగా తిరుగుతోంది అమ్మడు. ఆ సినిమా హిట్ కొడితే మళ్లీ ట్రాక్ ఎక్కేయెచ్చన్నది లావణ్య ఆశ. ఇంటెలిజెంట్ లో మెగా హీరో సాయిధరమ్ తేజ్ పక్కన ఆమె నటిస్తోంది. వివి వినాయక్ ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించాడు. చూద్దాం ఈ ఇంటెలిజెంట్ బ్యూటీ భవిష్యత్తేంటో.