టాలీవుడ్ ఇండస్ట్రీలోని ప్రముఖ హీరోలలో అల్లు శిరీష్ (Allu Sirish) ఒకరు కాగా అల్లు శిరీష్ నటించిన కొన్ని సినిమాలు మంచి సినిమాలుగా పేరును సొంతం చేసుకుంటే మరికొన్ని సినిమాలు కమర్షియల్ హిట్లుగా నిలిచి లాభాలను మిగిల్చాయి. అయితే అల్లు శిరీష్ కొత్త సినిమా బడ్డీ టైటిల్ తో తెరకెక్కగా జులై 26వ తేదీన ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమా డిజిటల్ హక్కులు నెట్ ఫ్లిక్స్ సొంతమయ్యాయి. బడ్డీ (Buddy) సినిమా ట్రైలర్ ప్రేక్షకులను మెప్పించిన సంగతి తెలిసిందే.
ఈ సినిమా రీమేక్ అని వార్తలు వినిపించినా ఆ వార్తల్లో ఏ మాత్రం నిజం లేదని శిరీష్ ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు. ఈ సినిమాకు శామ్ ఆంటోన్ దర్శకుడు కాగా దర్శకుడు మాట్లాడుతూ జ్ఞానవేల్ రాజా (K. E. Gnanavel Raja) గారి ప్రొడక్షన్ లో డార్లింగ్ సినిమా చేశానని అది నా ఫస్ట్ మూవీ అని ఆయన అన్నారు. ఆ సినిమా నుంచి జ్ఞానవేల్ రాజా గారికి నాపై నమ్మకం పెరిగిందని శామ్ ఆంటోన్ (Sam Anton) వెల్లడించారు.
జ్ఞానవేల్ రాజా నన్ను స్క్రిప్ట్ కూడా అడగకుండా ఈ సినిమాకు నన్ను ఎంపిక చేశారని బడ్డీ సినిమా సీజీ పూర్తైన తర్వాత జ్ఞానవేల్ రాజా ఫైనల్ వెర్షన్ చూశారని రాజమౌళి ఈగ మూవీ ఈ సినిమాకు ఇన్స్పిరేషన్ అని ఆయన తెలిపారు. బడ్డీకి సీజీ వర్క్ సమయంలో ఈగ సినిమాతో పోల్చి సలహాలు ఇచ్చేవాడినని శామ్ ఆంటోన్ అన్నారు.
అల్లు శిరీష్ మాట్లాడుతూ బడ్డీ ట్రైలర్ చూసిన తర్వాత నాకు కాన్ఫిడెన్స్ వచ్చిందని తెలిపారు. కొత్త తరహా సినిమాలను ప్రేక్షకులను రిసీవ్ చేసుకుంటారని శిరీష్ అన్నారు. బడ్డీ మూవీ విషయంలో శిరీష్ నమ్మకం నిజమవుతుందేమో చూడాల్సి ఉంది. అల్లు శిరీష్ ను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతోంది. అల్లు శిరీష్ త్వరలో కొత్త ప్రాజెక్ట్ లను ప్రకటిస్తారేమో చూడాల్సి ఉంది.