ఒకరికొకరు హాటీ అంటూ ప్రశంసించుకున్న కాజల్, తమన్నా!

దక్షిణాది చిత్ర పరిశ్రమల్లో టాప్ హీరోయిన్స్ జాబితాలో కాజల్ అగర్వాల్, తమన్నా లు ముందుంటారు. ఇద్దరూ బాలీవుడ్ లోను సినిమాలు చేసి అక్కడి వారిని అలరించారు. అయితే స్టార్ హీరోల సినిమాల్లో మెయిన్ హీరోయిన్ గా నటిస్తూనే అప్పుడప్పుడు ఐటెం సాంగ్ తో మెరవడం వీరికి అలవాటు. తమన్నా ఈ విషయంలో ఒకడుగు ముందుంది. కాజల్ కేవలం జనతా గ్యారేజ్ లో పక్కా లోకల్ అనే ఒక స్పెషల్ సాంగ్ మాత్రమే చేసింది. తమన్నా అనేక సినిమాలో అందాలతో అదరగొట్టింది. ఆమె తాజాగా ఎన్టీఆర్ జై లవకుశ సినిమాలో చేసిన “స్వింగ్ జరా” పాటకి మంచి రెస్పాన్స్ వచ్చింది. మాస్ అభిమానులను ఉర్రూతలూగించింది.

ఈ వీడియో సాంగ్ ని ఆడియో కంపెనీ రిలీజ్ చేసింది. ఈ పాట వీడియో లింక్ ని పోస్ట్ చేసిన తమన్నా.. “మీరు ఊగిపోవడానికి సాంగ్ వచ్చేసింది” అంటూ పోస్ట్ చేసింది. దానికి కాజల్ తన ట్విట్టర్ పేజిలో “ఊహూ…హాటీ” అంటూ రిప్లై ఇచ్చింది.  దీనిపై తమన్నా వెంటనే స్పందించింది. “నేను కాదు హాటీ….నువ్వే” అంటూ పోస్ట్ చేసింది. వీరిద్దరూ ఈగోలను పక్కన పెట్టి చేసిన పోస్ట్ లు నెటిజనులు బాగా ఆకట్టుకున్నాయి.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus