సాధారణంగా పెద్ద సినిమాలు టాక్ తో సంబంధం లేకుండా ఫస్ట్ వీకెండ్ వరకు బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లను సాధిస్తాయనే సంగతి తెలిసిందే. టాక్ మరీ నెగిటివ్ గా ఉంటే తప్ప సినీ అభిమానులు పెద్ద సినిమాలను థియేటర్లలో చూడటానికి దూరంగా ఉండరు. అయితే ఆచార్య, సర్కారు వారి పాట సినిమాలు రిలీజైన రోజున తెల్లవారుజాము నుంచే సోషల్ మీడియాలో విపరీతంగా నెగిటివ్ కామెంట్లు వచ్చాయి. సినిమా తమ అంచనాలకు కొంచెం తగ్గినా డిజాస్టర్ అనేలా యాంటీ ఫ్యాన్స్ వ్యవహరిస్తున్నారు.
ఆచార్య, సర్కారు వారి పాట సినిమాల విషయంలో ఇదే సీన్ రిపీట్ అయింది. ఈ స్థాయిలో నెగిటివ్ టాక్ స్ప్రెడ్ కాకుండా ఉండి ఉంటే ఈ సినిమా కలెక్షన్లు మరింత మెరుగ్గా ఉండి ఉండేవని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ నెగిటివ్ టాక్ వల్ల వీకెండ్ లో మంచి పేరు ఉన్న థియేటర్లలో సైతం ఆక్యుపెన్సీ పడిపోవడం గమనార్హం. సోషల్ మీడియాలో ఫ్యాన్స్ వార్ ను కంట్రోల్ చేయడం ఎవరి తరం కాదు.
అయితే సినిమాలు ఫ్లాప్ కావడం వల్ల హీరోల కంటే నిర్మాతలు నష్టపోయే అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయని చెప్పవచ్చు. పెద్ద హీరోల సినిమాలను యాంటీ ఫ్యాన్స్ టార్గెట్ చేస్తే బయ్యర్లు పెద్ద సినిమాలకు దూరంగా ఉండే పరిస్థితి అయితే ఏర్పడుతుందని చెప్పవచ్చు. సినిమా రంగంపై ఆధారపడి కొన్ని వందల కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి.
తమ ఫేవరెట్ హీరోల సినిమాలకు నెగిటివ్ టాక్ ను ప్రచారం చేస్తుండటంపై హీరోల అభిమానులు సైతం హర్ట్ అవుతున్నారు. మరోవైపు టికెట్ రేట్లు పెంచడం వల్లే ఈ తరహా ప్రచారం జరుగుతుందని కూడా వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి. భవిష్యత్తులో విడుదల కాబోయే పెద్ద సినిమాలు టికెట్ రేట్ల పెంపుకు దూరంగా ఉంటే మంచిదని అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.
Most Recommended Video
10 ఏళ్ళ ‘గబ్బర్ సింగ్’ గురించి 12 ఆసక్తికరమైన విషయాలు..!
‘చెల్లమ్మ’ టు ‘మ మ మహేషా’.. జోనిత గాంధీ పాడిన 10 సూపర్ హిట్ పాటల లిస్ట్..!
ఎన్టీఆర్- బాలయ్య టు చిరు-చరణ్… నిరాశపరిచిన తండ్రీకొడుకులు కాంబినేషన్లు..!