జోనిత గాంధీ ఈ సింగర్ గురించి బహుశా ఎక్కువ మందికి తెలిసుండదు. కానీ ఈమె ఎన్నో చార్ట్ బస్టర్ పాటలు పాడింది. కాదు కాదు ఈమె పడటం వల్లే ఆ పాటలు చార్ట్ బస్టర్స్ అయ్యాయి అని చెప్పాలి.. అలా చెప్పడంలో కూడా అతిశయోక్తి లేదు. ఈమె కెనడా దేశానికి చెందిన మహిళ. బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ ‘చెన్నై ఎక్స్ ప్రెస్’ ద్వారా ఈమె సినిమాల్లో పాటలు పడటం మొదలుపెట్టింది. ఆ తర్వాత పలు ఇంగ్లీష్, హిందీ, బెంగాలీ సినిమాలకి పాటలు పాడటం మొదలు పెట్టింది. అయితే తమన్ ఈమెను టాలీవుడ్ కు తీసుకొచ్చాడు.
‘కిక్ 2’ సినిమాలో ‘నువ్వే నువ్వే’ ప్రాణం అనే పాటని పాడింది. ఖాళీగా ఉంటే.. ఈ పాటని ఓ సారి వినండి. తర్వాత 3,4 సార్లు గ్యారెంటీగా వింటారు. అంత బాగా పాడింది జోనిత. అయితే ‘కేరింత’ సినిమా మొదట విడుదలైంది కాబట్టి.. అందులో ‘ఏ కథ’ అనే పాటని జోనిత పాడింది కాబట్టి లెక్క ప్రకారం ఆమెకి తెలుగులో అదే మొదటి సినిమా అని చెప్పాలి. ఇప్పటివరకు ఆమె తెలుగులో పాడిన చాలా పాటలు చార్ట్ బస్టర్స్ అయ్యాయి. ఆ పాటలు ఏంటో.. అవి ఏ సినిమాలోనివో తెలుసుకుందాం రండి :
1) నువ్వే నువ్వే – కిక్ 2 : రవితేజ హీరోగా నటించిన ఈ చిత్రానికి తమన్ సంగీతం అందించారు. ‘నువ్వే నువ్వే’ పాటని జోనిత చాలా బాగా పాడింది.
2) మనసుకే – 24 : సూర్య హీరోగా నటించిన ఈ చిత్రానికి ఏ.ఆర్. రెహమాన్ సంగీతం అందించాడు. ‘మనసుకే’ పాట చాలా బాగుంటుంది. జోనిత చాల బాగా పాడింది.
3) హంసరో – చెలియా : కార్తీ హీరోగా నటించిన ఈ చిత్రంలో హంసరో పాట సూపర్ హిట్. జోనిత ఈ పాటని చాలా బాగా పాడింది. ఏ ఆర్ రెహమాన్ ఈ చిత్రానికి సంగీతం అందించారు.
4)ఏవేవో – ‘హలో’ : అఖిల్ హీరోగా నటించిన ఈ చిత్రంలో ఏవేవో పాట సూపర్ హిట్. అనూప్ రూబెన్స్ సంగీతం అందించిన ఈ పాటని జోనిత ఆలపించడం విశేషం.
5)ఏవో ఏవో కలలే – లవ్ స్టోరీ : నాగ చైతన్య హీరోగా నటించిన ఈ చిత్రానికి పవన్.సి.హెచ్ సంగీత దర్శకుడు.ఏవో ఏవో కలలే పాటని జోనిత పాడిన విధానం అందరినీ ఆకట్టుకోవడం ఖాయం.
6)ఓ మై గాడ్ పిల్లా – సర్కార్ : విజయ్ హీరోగా నటించిన ఈ మూవీకి రెహమాన్ సంగీత దర్శకుడు. ఓ మై గాడ్ పిల్లా అనే పాటని జోనిత పాడింది చాలా బాగుంటుంది ఈ పాట.
7)మెంటల్ మదిలో – ఓకె బంగారం : దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన ఈ మూవీకి రెహమాన్ సంగీత దర్శకుడు. ఈ మూవీలో మెంటల్ మదిలో అనే పాటని జోనిత చాలా బాగా పాడింది.
8) చల్లమ్మ(చిట్టెమ్మ)- డాక్టర్ : శివ కార్తికేయన్ హీరోగా నటించిన ఈ మూవీలో ‘చల్లెమ్మ’ పాట సూపర్ హిట్ అయ్యింది. అనిరుధ్ సంగీతం అందించిన ఈ పాటని జోనిత చాలా యాక్టివ్ గా పాడింది.
9) హలమితి హబీబో – బీస్ట్ : విజయ్ హీరోగా నటించిన ఈ మూవీకి అనిరుథ్ సంగీత దర్శకుడు. హలమితి హబీబో అనే పాటని జోనిత చాలా యాక్టివ్ గా పాడింది.
10)మ మ మహేషా – సర్కారు వారి పాట : మహేష్ బాబు హీరోగా నటించిన ఈ చిత్రానికి తమన్ సంగీత దర్శకుడు. మ మ మహేషా పాటని జోనిత చాలా యాక్టివ్ గా పాడింది.