పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా శృతీ హాసన్ హీరోయిన్ గా హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘గబ్బర్ సింగ్’. 2012 వ సంవత్సరం మే 11న విడుదలైన ఈ మూవీ సూపర్ హిట్ గా నిలిచింది. ప్రముఖ కమెడియన్ కమ్ నిర్మాత బండ్ల గణేష్ ఈ చిత్రాన్ని నిర్మించారు.దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ చిత్రానికి సతీష్ వేగేశ్న, రమేష్ రెడ్డి స్క్రీన్ ప్లే ని అందించారు. ఈరోజుతో ‘గబ్బర్ సింగ్’ విడుదలై 11 ఏళ్ళు పూర్తి కావస్తోంది. ఈ చిత్రం గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం రండి :
1) పవన్ కళ్యాణ్ ‘ఖుషి’ తర్వాత ఆ స్థాయిలో బ్లాక్ బస్టర్ కొట్టలేదు. ‘జల్సా’ కొంత రిలీఫ్ ఇచ్చింది కానీ అతన్ని మళ్ళీ బ్లాక్ బస్టర్ ట్రాక్ ఎక్కించింది ‘గబ్బర్ సింగ్’ అనే చెప్పాలి.ఈ రెండు చిత్రాలకి మధ్యలో పవన్ కళ్యాణ్ కు ‘కొమరం పులి’ ‘తీన్ మార్’ ‘పంజా’ వంటి డిజాస్టర్లు ఉన్నాయి. సరిగ్గా అదే టైంలో బాలీవుడ్లో సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన ‘దబాంగ్’ చిత్రాన్ని రీమేక్ చేయాలని చాలా మంది టాలీవుడ్ నిర్మాతలు ప్రయత్నాలు మొదలుపెట్టారు.
2) ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ ‘దబాంగ్’ రీమేక్ రైట్స్ ను కొనుగోలు చేశారు. ‘పవన్ కళ్యాణ్ ఆర్ట్స్’ బ్యానర్ ను స్థాపించి ఆ చిత్రాన్ని తనే నిర్మించాలి అని పవన్ అనుకున్నారు. అంతేకాదు మొదట పవన్ కళ్యాణే ఈ ప్రాజెక్టుని డైరెక్ట్ చేయాలి అనుకున్నారు.
3) మరో పక్క ‘దబాంగ్’ ను రవితేజ ను హీరోగా పెట్టి చేయాలనే ఆలోచన హరీష్ శంకర్ కు వచ్చింది. కానీ అప్పటికే దాని రీమేక్ రైట్స్ ను పవన్ దక్కించుకున్నారు అని తెలుసుకుని వెళ్లి ఆయన్ని కలుసుకున్నారు. ఆ టైంలో ఆ చిత్రంలో మార్పులు చేసి తనే డైరెక్ట్ చేయాలి అనుకుంటున్నట్టు పవన్ హరీష్ తో చెప్పారు. కానీ ‘నేను చేయాలనుకుంటున్నాను’ అని హరీష్ చెప్పడంతో పవన్.. తెలుగు నేటివిటీకి తగినట్టు 40 శాతం మార్పులు చేయాలని చెప్పారు.
4) అందుకు హరీష్ ఒకే చెప్పారు.. అంతకు ముందు పవన్ కు ‘మిరపకాయ్’ కథని హరీష్ వినిపించాడు. కానీ పవన్ ఆ టైంలో బిజీగా ఉండడంతో దాన్ని రవితేజతో చేసి హిట్ అందుకున్నాడు హరీష్. ‘మిరపకాయ్’ ఫలితం చూసాకే పవన్ ‘గబ్బర్ సింగ్’ అవకాశాన్ని హరీష్ కు అప్పగించారు అని అంతా అంటుంటారు.
5) ఇక ‘తీన్ మార్’ ప్లాప్ అవ్వడం తాను నిర్మించుకుందాం అనుకున్న ‘గబ్బర్ సింగ్’ ను నిర్మాత బండ్ల గణేష్ కు ఇచ్చారు పవన్.
6) ‘దబాంగ్’ రీమేక్ ‘గబ్బర్ సింగ్’ కంటే ముందే తమిళంలో శింబు హీరోగా ‘ఓస్తి’ పేరుతో రీమేక్ అయ్యింది. అక్కడ ఈ మూవీ డిజాస్టర్ అయ్యింది. దాంతో తెలుగు రీమేక్ పై ఎన్నో అనుమానాలు వ్యక్తమయ్యాయి.
7) ఇందుకు కారణాలు లేకపోలేదు.. పవన్ కళ్యాణ్ వరుస ప్లాపుల్లో ఉన్నాడు,హిట్టు మొహం చూడని శృతీ హాసన్ హీరోయిన్, బండ్ల గణేష్ నిర్మాతగా ఒక్క హిట్టు అందుకోలేదు. ఇవన్నీ పవన్ ఫ్యాన్స్ ను చాలా భయపెట్టాయి.
8) ‘గబ్బర్ సింగ్’ చిత్రానికి మొదట తమన్ ను సంగీత దర్శకుడిగా అనుకున్నాడు దర్శకుడు హరీష్ శంకర్. అయితే తమన్ బిజీగా ఉండటం వల్ల దేవి శ్రీ ప్రసాద్ కు ఆ ఛాన్స్ దక్కింది.
9) ఈ చిత్రంలో ‘కెవ్వు కేక’ పాటకి ముందుగా అనుష్కని తీసుకోవాలి అనుకున్నారు. కానీ ఆమె బిజీగా ఉండడంతో ఒరిజినల్ లో చేసిన మలైకా అరోరాని తీసుకున్నారు. ఈ పాట ఆ టైములో తెలుగు రాష్ట్రాలను ఓ ఊపు ఊపేసింది.
10) ‘గబ్బర్ సింగ్’ లో పవన్ తమ్ముడి పాత్రకి మొదట సుశాంత్ వంటి యంగ్ హీరోలని అనుకున్నారు. చివరికి అజయ్ ను ఫైనల్ చేశారు.
11) 89 రోజుల్లో ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు హరీష్ శంకర్. మే 11 న విడుదలైన ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. పవన్ కళ్యాణ్ కెరీర్లో అప్పటివరకు రూ.30 కోట్ల షేర్ మూవీ కూడా లేదు. అలాంటిది ఈ మూవీతో ఏకంగా రూ.63 కోట్ల షేర్ ను కొల్లగొట్టాడు.
12) కొన్నాళ్ళ తర్వాత ఈ చిత్రానికి సీక్వెల్ గా ‘సర్దార్ గబ్బర్ సింగ్’ తీసినా అది డిజాస్టర్ అయ్యింది. ఇప్పటికీ ‘గబ్బర్ సింగ్’ మూవీ బుల్లితెరపై ప్రేక్షకుల్ని అలరిస్తూనే ఉంది.