బుల్లితెర యాంకర్ ఓంకార్ గురించి ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎన్నో టీవీ షోలను తన హోస్టింగ్ ద్వారా ఓంకార్ సక్సెస్ చేశారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఓంకార్ మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చారు. యాక్టర్ లేదా డైరెక్టర్ కావాలని ఇండస్ట్రీలోకి వచ్చానని కానీ యాంకర్ అయ్యానని ఓంకార్ తెలిపారు. నాన్న డాక్టర్ అని సొంతూరు కాకినాడ అని తక్కువ ఖర్చుతో నాన్న వైద్యం చేయడంతో ఎక్కువ డబ్బులు సంపాదించుకోలేదని ఓంకార్ అన్నారు.
ఆదిత్య మ్యూజిక్ లో పని చేసే సమయంలో జీ తెలుగులో తనకు ఛాన్స్ వచ్చిందని ఓంకార్ తెలిపారు. చిన్నప్పటి నుంచి విఠలాచార్య సినిమాలు అంటే తనకు ఎక్కువగా ఇష్టమని ఓంకార్ పేర్కొన్నారు. సోషియో ఫాంటసీ షో చేయాలనే ఆలోచనతో మాయాద్వీపం మొదలుపెట్టామని ఆ షో తర్వాత కెరీర్ పరంగా వెనక్కు తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదని ఓంకార్ వెల్లడించారు. తనను ఆట షో టాప్ ప్లేస్ కు తీసుకెళ్లిందని ఓంకార్ అన్నారు.
ఎనిమిది సంవత్సరాల తర్వాత మాయాద్వీపంతో మళ్లీ ప్రేక్షకుల ముందుకు వచ్చానని ఓంకార్ వెల్లడించారు. పిల్లల మాటలు, కల్మషం లేని నవ్వులు బాధను మరిపిస్తాయని అందుకే పిల్లలతో షో చెయ్యడానికి ఇష్టపడతానని ఓంకార్ పేర్కొన్నారు. నాన్న మంచితనం ఫలితమే తన సక్సెస్ అని భావిస్తానని ఓంకార్ అన్నారు. తనను ఇమిటేట్ చేయడం గురించి చాలా సంతోషపడతానని కొంతమందికి ఇమిటేట్ చేయడం ఉపాధి అని ఇమిటేట్ చేయడాన్ని సరదాగా తీసుకుంటానని ఓంకార్ పేర్కొన్నారు.