Hema: సీనియర్ నటి హేమ భర్త గురించి ఈ విషయాలు మీకు తెలుసా?

  • May 25, 2024 / 07:41 PM IST

సీనియర్ నటి హేమ (Hema) అందరికీ సుపరిచితమే. బాలకృష్ణ (Balakrishna) హీరోగా వచ్చిన ‘భలే దొంగ’ సినిమాతో ఈమె నటిగా కెరీర్ ను ప్రారంభించింది. ఆ తర్వాత రాంగోపాల్ వర్మ (Ram Gopal Varma) దర్శకత్వంలో తెరకెక్కిన ‘క్షణ క్షణం’ (Kshana Kshanam) చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత ఈమె వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. వరుస సినిమాల్లో సహాయ నటి పాత్రలు ఈమె తలుపు తట్టాయి. దీంతో బిజీ ఆర్టిస్ట్ గా ఓ వెలుగు వెలిగింది.

అయితే కొంతకాలంగా ఈమెకు ఆఫర్లు తగ్గాయి. ‘మా’ ఎన్నికల టైంలో తప్ప ఈమె పెద్దగా హాట్ టాపిక్ అయ్యింది. ఆ తర్వాత ఈమె గురించి ఎటువంటి చప్పుడు లేదు. మళ్ళీ ఇప్పుడు ‘బెంగళూరు రేవ్ పార్టీ’ వల్ల వార్తల్లో నిలిచింది. ఇదిలా ఉండగా.. హేమ అసలు పేరు కృష్ణ వేణి అనే సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్లోని, తూర్పుగోదావరి జిల్లాకు చెందిన రాజోలుకి చెందిన వ్యక్తి ఈమె. హేమ ఫ్యామిలీ గురించి కూడా చాలా మందికి తెలిసే ఉండొచ్చు.

సయ్యద్ జాన్ అహ్మద్ అనే వ్యక్తిని ఈమె ప్రేమ వివాహం చేసుకుంది. అంతేకాదు వీరిది కులాంతర వివాహం కూడా..! దూరదర్శన్ ఛానల్లో వీరిద్దరూ కలిసి పనిచేశారు.ఆ టైంలో వీరి మధ్య ప్రేమ చిగురించింది. తర్వాత పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. ఈ జంటకు ఈషా అనే అమ్మాయి కూడా ఉంది. అప్పుడప్పుడు హేమ తన ఫ్యామిలీ పిక్స్ ని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus