Actress Ammu Abhirami: నారప్ప ఫస్ట్ లవర్.. ఎవరో గుర్తు పట్టారా?

సౌత్ ఇండస్ట్రీలో నటుల కంటే కూడా నటిమణులకు అన్ని భాషల్లో డిమాండ్ ఉంటుంది. అందంతో పాటు కాస్త టాలెంట్ ఉన్నా కూడా భాషతో సంబందం లేకుండా సినిమాలు చేస్తుంటారు. ఇక ప్రస్తుతం ఒక క్యూట్ గర్ల్ పేరు సౌత్ లో హాట్ టాపిక్ గా మారుతొంది. ఆమె మరెవరో కాదు. అమ్ము అభిరామి. పేరుతోనే కవ్విస్తున్న ఈ ముద్దుగుమ్మ తన హోమ్లీ అందంతో కూడా మైమరిపిస్తోంది. నారప్ప సినిమాలో వెంకటేష్ ప్రేయసి పాత్ర చేసిన కన్నమ్మ ఎవరని గత రాత్రి నుంచి ఇంటర్నెట్ లో తెగ సెర్చ్ చేస్తున్నారు.

ఈ క్యూట్ అమ్మాయి తమిళ్ అసురన్ లో కూడా అదే పాత్రలో నటించింది. ఇక రీమేక్ చేసే క్రమంలో శ్రీకాంత్ అడ్డాలకు మరో నటి తట్టలేక ఆమెనే ఫిక్స్ చేశారు. అమ్ము అభిరామి ఇదివరకే తెలుగు తమిళ్ రాక్షసుడు సినిమాలో హీరో మేన కొడలి పాత్రలో నటించింది. 2017లో విజయ్ బైరవ సినిమాలో ఒక మెడికల్ స్టూడెంట్ గా నటించి మంచి గుర్తింపు అందుకుంది. ఇక తెలుగులో జగపతి బాబు ప్రధాన పాత్రలో నటించిన ఎఫ్‌సీయూకే(ఫాదర్‌ ఆఫ్‌ చిట్టి ఉమా కార్తీక్‌)లోనూ ఉమా అనే పాత్రలో కనిపించింది.

ఈ విధంగా అభిరామి తెలుగు తమిళ్ అని తేడా లేకుండా రెండు భాషల్లోనూ ఆఫర్స్ అందుకుంటూ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకుంటోంది. ఇక త్వరలోనే తెలుగులో ఒక చిన్న హీరోతో జోడి కట్టనున్నట్లు టాక్ వస్తోంది.

Most Recommended Video

పెళ్లి దాకా వచ్చి విడిపోయిన జంటలు!
తమిళ హీరోలు తెలుగులో చేసిన స్ట్రైట్ మూవీస్ లిస్ట్!
దర్శకులను ప్రేమించి పెళ్లి చేసుకున్న హీరోయిన్స్

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus